Kaizer News

కంటతడి పెట్టిస్తున్న నేపాల్ విధ్వంసం విజువల్స్..గా

కంటతడి పెట్టిస్తున్న నేపాల్ విధ్వంసం విజువల్స్..గాయాలతో తల్లిదండ్రుల కోసం వెతుకుతున్న పసిపిల్లలు

· State - Telangana · v6velugu.com

హార్ట్​ బ్రేకింగ్​ విజువల్స్. నేపాల్​ప్రకృతి విధ్వంసం మిగిల్చిన విషాదానికి సాక్ష్యాలు ఈ చిన్నారులు. ఒంటినిండా గాయాలు, అమాయకపు ముఖాల్లో వర్ణించలేని బాధ, కన్నవారికోసం తల్లడిల్లుతున్న పసిహృదయాలు. రెండేళ్ల చిన్నారి తమ్ముడిని వీపున కట్టుకొని వరదల్లో కొట్టుకుపోయిన తల్లిదండ్రులకోసం వెతుక్కుంటున్న ఐదేళ్ల నేపాల్​ చిన్నారి వీడియో సోషల్ మీడియాలో హాట్​ టాపిక్​ అయింది. విజువల్స్​గుండెలు పిండేస్తున్నాయి. కంటతడి పెట్టిస్తున్నాయి. ఈ వీడియోను Jeet అనే X అకౌంటులో ఆదివారం(ఆగస్టు30) షేర్​ చేశారు. షేర్​ చేసిన కొద్ది 4గంటల్లోనే 6లక్షల40వేల మంది చూశారు. చిన్నారుల తల్లిదండ్రుల ఆచూకీ దొరకాలని చాలా మంది నెటిజన్లు దేవుడిని ప్రార్థించారు. ఇలాంటి పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కోరుకున్నారు. అయితే కొందరు ఇది గతంలోనిదని కొందరు, ఫేక్​ వీడియా అని కొందరు అంటున్నా ఎక్కువమంది ఇటీవలి నేపాల్​ విధ్వంసం మిగిల్చిన విషాద విజువల్స్​ అని అంటున్నారు

Original source: v6velugu.com
Read more on Kaizer News