Kaizer News

‘వేటు’ కోసం ఫైటు

‘వేటు’ కోసం ఫైటు

· State - Telangana · ntnews.com

కొండా సురేఖపై చర్యలే లక్ష్యంగా ఢిల్లీకి! 2న విదేశాల నుంచి కేసీ వేణుగోపాల్‌ రాక 3న ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్‌ మంత్రిపై వేటు పడకుంటే రాష్ట్రంలో సీనియర్ల నియంత్రణ కష్టమని ఆందోళన చర్చను పక్కదారి పట్టించేలా తెర మీదికి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అంశం ఆచితూచి అడుగులేస్తున్న అధిష్ఠానం మంత్రి కొండా సురేఖ వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్‌ సంకటపరిస్థితిలో చిక్కుకున్నారు. అన్ని ఆరోపణల తర్వాతా, అంత జరిగినంకా మంత్రిపై చర్యలు తీసుకోలేకపోతే.. ‘అసమర్థత’ ముద్ర పడే ప్రమాదం! వేటు వేయాలంటే కాంగ్రెస్‌ నాయకత్వాన్ని ఒప్పించాల్సిన అనివార్యత! ఆయనకు ఇది పరువు-ప్రతిష్టలకు సంబంధించిన అంశంగా మారింది. ఇప్పటికే ఆలస్యమైందని భావిస్తున్న రేవంత్‌.. సురేఖపై చర్యలే లక్ష్యంగా ఢిల్లీకి వెళ్లి ప్రయత్నాలు చేయాలని నిశ్చయించుకున్నారు. హైదరాబాద్‌, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): మంత్రి కొండా సురేఖపై క్రమశిక్షణా చర్యల వ్యవహారం ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరువు ప్రతిష్టలతో ముడిపడిన జీవన్మరణ సమస్యగా రూపాంతరం చెందినట్టు తెలంగాణ ప్రజ లు భావిస్తున్నారని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. ఆమెను మంత్రివర్గం నుంచి తక్షణం తప్పించకపోతే ‘అసమర్థత’ ము ద్రపడే ప్రమాదం ఉన్నదని సీఎం శిబిరం తీవ్ర ఆందోళనలో ఉన్నట్టు సమాచారం. మరోవైపు, సీఎం రేవంత్‌రెడ్డ్డి ఎంత ఒత్తిడి తెస్తున్నా, అధిష్ఠానం మాత్రం కొండా విషయంలో అనుకున్నంత వేగంగా స్పందించడం లేదని, వేచి చేసే ధోరణితోనే ఉన్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తన రాజకీయ అస్తిత్వానికి సవాల్‌గా నిలిచిన ఈ వ్యవహారంపై సానుకూల ఫలితాలను రాబట్టడం కోసమే ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ సెప్టెంబర్‌ 2న విదేశాల నుంచి ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఆయనను ఎలాగైనా ఒ ప్పించి, కొండాపై వేటు వేయించాలనే ఏకై క లక్ష్యంతో సెప్టెంబర్‌ 3న సీఎం రేవంత్‌రెడ్డి హస్తిన టూర్‌ పెట్టుకున్నారని గాంధీభవన్‌ వర్గాలు అంటున్నాయి. ఇటీవల కొండా సురేఖ కుమార్తె సుస్మితాపటేల్‌ చేసిన సంచలన వ్యాఖ్యలు సీఎం శిబిరాన్ని తీవ్రంగా కుదిపేశాయి. 17 మంది ఎమ్మెల్యేలతో అత్యవసర మీడియా సమావేశం ఏర్పాటు చేయించి, సురేఖను మంత్రివర్గం నుంచి తక్షణమే బర్తరఫ్‌ చేయాలని బహిరంగంగా డిమాండ్‌ చేయించారు. వేముల వీరేశం వంటి నేతలను రంగంలోకి దించి కొండా వర్గంపై సీఎం శిబిరం పెద్ద యుద్ధమే ప్రకటించింది. ఈ రచ్చ పీక్స్‌కు చేరడంతో మల్లు రవి నేతృత్వంలోని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ రంగంలోకి దిగింది. సురేఖ నుంచి రెండుసార్లు వివరణ తీసుకొని, నివేదికను తయారుచేసి పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ద్వారా ఏఐసీసీకి పంపించింది. మంత్రి పదవి నుంచి సురేఖను తొలగించడంతోపాటు కనీసం ఆరు నెలలపాటు పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని, ఇదే తరహా చర్యలను సీనియర్‌ నేత జీ చిన్నారెడ్డిపై కూడా తీసుకోవాలని ఆ కమిటీ సిఫార్సు చేసినట్టు లీకులు ఇచ్చారు. తుది నిర్ణయం పూర్తిగా అధిష్ఠానం చేతుల్లోనే ఉన్నదని, హైకమాండ్‌ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని పీసీసీ అధ్యక్షుడు పైకి చెప్తుండగా, అధిష్

Original source: ntnews.com
Read more on Kaizer News