Kaizer News

భజన పోటీలతో ఆధ్యాత్మిక సందడి

భజన పోటీలతో ఆధ్యాత్మిక సందడి

· State - Telangana · prabhanews.com

ఊట్కూర్, ఆంధ్రప్రభ: నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని శ్రీ అంబాభవాని మాత దేవాలయం వద్ద వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన భజన పోటీలు భక్తిశ్రద్ధల మధ్య ఉత్సాహంగా కొనసాగాయి. వివిధ గ్రామాల నుంచి వచ్చిన భజన బృందాలు పాల్గొని భక్తి గీతాలు, కీర్తనలు ఆలపిస్తూ భక్తులను ఆకట్టుకున్నారు. భజన బృందాల ప్రదర్శనలతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ పోటీల్లో 9 భజన బృందాలు పాల్గొని భజన కీర్తనలు, తత్వాలు పోటాపోటీగా పాడారు. ఈ పోటీలో పాల్గొన్న భ‌జ‌న బృందాల‌కు నిర్వాహ‌కులు న‌గ‌దు బహుమతులు అంద‌జేశారు. కార్యక్రమంలో పెద్ద జట్రం సర్పంచ్ వాకిటి వెంకటేష్ , కృష్ణయ్య, భరత్, సూర్యప్రకాష్ రెడ్డి, హన్మంతు, కేశవ్‌ రావు, హెచ్. నర్సింహా,సుధాకర్ రెడ్డి, మహేందర్, నర్సప్ప తదితరులు పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News