Shorts కోనసీమ: అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీస్ శాఖకు నేర పరిశోధనల నిమిత్తం ఇటీవల మంజూరైన అత్యాధునిక మొబైల్ ఫోరెన్సిక్ ల్యాబ్ వాహనంపై జిల్లా పేరును తప్పుగా ముద్రించడం తీవ్ర వివాదాస్పదంగా మారింది మొబైల్ ఫోరెన్సిక్ వాహనాలు. జిల్లా ఏర్పడి ఇన్నేళ్లవుతున్నా అధికారుల నిర్లక్ష్య వైఖరి మారలేదనడానికి ఈ ఘటనే నిదర్శనమని బహుజన్ సమాజ్ పార్టీ అమలాపురం నియోజకవర్గ ఇంచార్జ్ పొలమూరి మోహన్ బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్యలు,అత్యాచారాలు, దొంగతనాలు వంటి కీలక కేసుల్లో ఘటనా స్థలం నుంచే సైంటిఫిక్ టెక్నీషియన్ల ద్వారా పక్కా ఆధారాలు సేకరించి కోర్టులకు అందించేందుకు ఉద్దేశించిన ఈ వాహనంపై,బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును అవమానపరిచేలా తప్పుగా రాయడం పట్ల దళిత సంఘాలు మండిపడుతున్నాయి. ఈ ఘోర పొరపాటును తక్షణమే సరిదిద్దాలని మరియు బాధ్యులైన ప్రభుత్వ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మోహన్ బాబు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ రాహుల్ మీనాకి ఫిర్యాదు సమర్పించారు,దీనిపై స్పందించిన ఎస్పీ వాహనంపై పేరును త్వరలోనే సరిచేయిస్తామని హామీ ఇచ్చారు