Kaizer News

హడలెత్తిన రైడ్‌.. వెంటపడ్డ వాహనాలు.. రెండు గంటల భయ

హడలెత్తిన రైడ్‌.. వెంటపడ్డ వాహనాలు.. రెండు గంటల భయానక జర్నీ!

· National - India · sakshi.com

వెనకాలే వస్తున్న వాహనాలు.. చుట్టూ వింత చూపులు.. రాత్రి వేళ నిశ్శబ్దంగా ఉన్న ఢిల్లీ రోడ్లు.. స్కూటర్‌పై ఒంటరి ప్రయాణం.. వెనుక నుంచి వస్తున్న వాహనాలు.. చీకటిలో తనవైపు నిలిచిపోయిన చూపులు.. మొదట ఇదంతా ఓ సాధారణ రాత్రి రైడ్‌లానే అనిపించింది. కానీ కొన్ని నిమిషాలు గడిచేసరికి పరిస్థితి మారిపోయింది. ఒకటి తర్వాత మరొకటి ఎదురైన ఘటనలతో ఆ ప్రయాణం చివరకు భయానక అనుభవంగా మారింది. రాత్రివేళ మహిళలు ఎదుర్కొనే పరిస్థితులను స్వయంగా తెలుసుకోవాలనుకున్న ఓ కంటెంట్‌ క్రియేటర్‌ ఈ ప్రయోగం చేశాడు. BeJaintle పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్‌ చేసే అతడు.. ఇంట్లోనే మహిళ మాదిరిగా కనిపించే మేకప్‌ వేసుకుని, డ్రెస్‌ ధరించి, తలకు దుపట్టా కప్పుకున్నాడు. ఆ తర్వాత స్కూటర్‌ తీసుకుని ఢిల్లీ రోడ్లపైకి బయలుదేరాడు. మొదట చూపులు.. ఆ తర్వాత వెంటపడటం! రోడ్డుపైకి వచ్చిన కొద్దిసేపటికే తనవైపు పలువురు చూస్తున్నారని క్రియేటర్‌ గుర్తించాడు. ఎక్కడికి వెళ్లినా ఆ చూపులు తనను వెంబడిస్తున్నట్లు అనిపించాయని అతడు వీడియోలో పేర్కొన్నాడు. ఒక దశలో ఇద్దరు వ్యక్తులు తనను గమనిస్తూ స్కూటర్‌ను అనుసరించారని అతడు ఆరోపించాడు. మొదట దూరంగా కనిపించిన వారు.. క్రమంగా తనకు దగ్గరగా రావడానికి ప్రయత్నించారని చెప్పాడు. మరో సందర్భంలో స్కూటర్‌ నడుపుతుండగానే ఓ వ్యక్తి తన దగ్గరకు వచ్చి మాట్లాడటం ప్రారంభించాడని తెలిపాడు. చీకటి రోడ్డుపై ఆటోలు.. అసలు టెన్షన్‌ అక్కడితో ఆగలేదు. ప్రయాణంలో రెండు ఆటోలు తన స్కూటర్‌ మార్గంలోకి పదేపదే వచ్చినట్లు క్రియేటర్‌ చెప్పాడు. ఓ ఆటో డ్రైవర్‌ తన స్నేహితులు వీడియో తీస్తున్నారని గుర్తించిన తర్వాత ఆగిపోయాడని అతడు తెలిపాడు. మరో డ్రైవర్‌ మాత్రం తన స్కూటర్‌ వైపు పలుమార్లు వాహనాన్ని మళ్లించినట్లు ఆరోపించాడు. ఆ వాహనం చివరకు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఊపిరి పీల్చుకున్నానని చెప్పాడు. ‘ఇక చాలు..’ అంటూ ముగింపు రెండు గంటలు గడిచేసరికి అతడి ఉత్సాహం మొత్తం భయంగా మారిపోయింది. పదేపదే ఎదురైన చూపులు, అనుసరిస్తున్నట్లు అనిపించిన వ్యక్తులు, తన దారిలోకి వస్తున్న వాహనాలతో తాను తీవ్ర అసౌకర్యానికి గురయ్యానని చెప్పాడు. గత రెండు గంటల్లో నాకు చాలా అసహ్యంగా అనిపించింది. ఆటోవాళ్లు, సైకిల్‌ వాళ్లు.. అందరూ చూస్తూనే ఉన్నారు. రాత్రివేళ అమ్మాయిలు ఒంటరిగా బయటకు రావడం నిజంగా సురక్షితం కాదనిపించింది అంటూ తన అనుభవాన్ని పంచుకున్నాడు. చివరకు ఆ ప్రయోగాన్ని మధ్యలోనే ఆపేశాడు. మహిళ వేషంలో చేసిన ఆ రాత్రి ప్రయాణం.. కేవలం సోషల్‌ మీడియా ప్రయోగంగా మొదలై, తనకు భయాన్ని మిగిల్చిన అనుభవంగా మారింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో చర్చకు దారితీసింది. మహిళలు రాత్రివేళ ఒంటరిగా ప్రయాణించే సమయంలో ఎదుర్కొనే అవాంఛిత చూపులు, అనుసరణ, వేధింపులపై పలువురు స్పందించారు. అయితే ఒక్క వ్యక్తి చేసిన ఈ ప్రయోగాన్ని ఆధారంగా చేసుకుని ఢిల్లీలో మహిళల భద్రతపై విస్తృతమైన నిర్ధారణకు రావడం సరికాదని మరికొందరు అభిప్రాయపడ్డారు. మొత్తానికి ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఇదీ చదవండి : గణేశ్‌ మండపం వద్ద కరెంట్‌ షాక్‌.. మహిళ, బాలిక మృతి కట్టుబాపు చీరలో కనువిందు చేస్తున్న కీర్తి సురేష్..(ఫోటోలు) ఎర్

Original source: sakshi.com
Read more on Kaizer News