Kaizer News

Karimnagar: గొల్లపల్లి ఎంపీడీవో పద్మ మాలతి సురేష్

Karimnagar: గొల్లపల్లి ఎంపీడీవో పద్మ మాలతి సురేష్ పదవీ విరమణ!

· State - Telangana · hmtvlive.com

కరీంనగర్: గొల్లపల్లి ఎంపీడీవో పద్మ మాలతి సురేష్ ఉద్యోగ పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్ లో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గొల్లపల్లి మండలానికి చెందిన పలువురు మాజీ ఎంపీడీవోలు, కరీంనగర్‌కు చెందిన మాజీ ఎమ్మార్వోలు పాల్గొని పద్మ మాలతి సురేష్‌ను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమెతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని... శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగ జీవితంలో ఆమె అందించిన సేవలను కొనియాడుతూ, విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేసి మంచి పేరు సంపాదించుకున్నారని ప్రశంసించారు. పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ ఆత్మీయ సమ్మేళనం సహచరులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల మధ్య సందడిగా సాగింది. కార్యక్రమంలో సందేవేణి మహేందర్ యాదవ్, సందేవేణి గీతాంజలి యాదవ్, మంజుల యాదవ్, రిటైర్డ్ ఎమ్మార్వో శ్రీహరి రెడ్డి, మలేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News