Kaizer News

Ainavilli: అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి నూతన పాలకమ

Ainavilli: అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారం!

· State - Telangana · hmtvlive.com

Ainavilli: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం శనివారం అత్యంత వైభవంగా జరిగింది. ​నూతన పాలకమండలి చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన విళ్ళ సూర్యనారాయణచే శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ ప్రమాణం చేయించారు. అనంతరం నూతన ధర్మకర్తల మండలి సభ్యులతో కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. ​ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ.. స్వామివారి దివ్య సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన నూతన పాలకమండలి, ఆలయాభివృద్ధికి, భక్తుల సౌకర్యార్థం అర్చనలు, సేవల విషయంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా విశేష కృషి చేయాలని ఆకాంక్షించారు. అయినవిల్లి ఆలయ విశిష్టతను మరింత పెంచేలా పాలక మండలి సభ్యులందరూ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News