Kaizer News

BRS Joinings | బీఆర్‌ఎస్‌లో చేరిన ఉద్యమకారులు

BRS Joinings | బీఆర్‌ఎస్‌లో చేరిన ఉద్యమకారులు

· State - Telangana · ntnews.com

ములుగు : జిల్లాలోని మల్లంపల్లి మండల సాధన సమితి అధ్యక్షులు గోల్కొండ రాజు ఆధ్వర్యంలో పలువురు ఉద్యమకారులు ఆదివారం బీఆర్‌ఎస్‌ ( BRS ) పార్టీలో చేరారు. ములుగులోని పార్టీ కార్యాలయంలో బీఆర్‌ఎస్‌ మల్లంపల్లి మండల పార్టీ అధ్యక్షుడు పాలేపు శీను ఆధ్వర్యంలో జిల్లా నాయకుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు సమక్షంలో మల్లంపల్లి మండల సాధన సమితి అధ్యక్షులు గోల్కొండ రాజు ఆధ్వర్యంలోని పలువురు ఉద్యమకారులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాకులమర్రి లక్ష్మణ్ బాబు వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందాయని తెలిపారు

Original source: ntnews.com
Read more on Kaizer News