ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం జరుగుతున్న పోచమ్మ తల్లి బోనాల ఉత్సవంలో మాజీ జెడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్ కుటుంబ సభ్యులు పాల్గొని అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనం సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారికి కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో బొట్ల పద్మజ, బొట్ల విశ్వేశ్వర్, బొట్ల సుభాషిని, బొట్ల మహేశ్వర్, బొట్ల అనురాధ, బూర్గుల జగదీశ్వరి, బొట్ల ఆనీశ్వర్ తదితరులు పాల్గొన్నారు