Kaizer News

Nellore: మైక్రోఫైనాన్స్ వేధింపులపై కలెక్టర్‌కు యాన

Nellore: మైక్రోఫైనాన్స్ వేధింపులపై కలెక్టర్‌కు యానాదుల వినతి

· State - Telangana · hmtvlive.com

Shorts నెల్లూరు: మైక్రో ఫైనాన్స్ సంస్థలు యానాదులకు ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన పక్కా ఇళ్ళకు లోన్లు ఇచ్చి మభ్యపెట్టి ప్రస్తుతం కలకత్తా కోర్టు నుంచి నోటీసులు పంపుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ విషయమై మాకు ఐటిడిఎ ద్వారా లీగల్ ఎయిడ్ ఇప్పించి ఆదుకోగలరని కోరడమైనది. గిరిజన యానాది కులమునకు చెందిన నిరుపేదలైన మేము కూలీపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాము. ప్రభుత్వము మాకు పక్కా గృహాలు నిర్మించి ఇచ్చి ఉంది. ఆయా గృహాలలో నివాసం ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాము. ఈ క్రమంలో మా వద్దకు కొంత మంది ఏజెంట్లు వచ్చి తక్కువ వడ్డీకి లోన్లు ఇస్తామని మభ్యపెట్టి మాతో సంతకాలు చేయించుకొని లోన్లు ఇప్పించి మాకు సగం ఇచ్చి వాళ్ళు సగం తీసుకున్నామన్నారు. కొద్ది నెలలు పాటు కష్టమైనా ఆయా మైక్రో కంపెనీలకు ఇ.ఎం.ఐ.లు చెల్లించాము. ప్రస్తుతము మా ఆర్థిక పరిస్థితులు బాగాలేనందున ఇ.ఎం.ఐ.లు చెల్లించడం లేదు. అయితే ఆయా మైక్రో ఫైనాన్స్ సంస్థలు మా మీద పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, కలకత్తా నగరంలో మాపై కోర్టులో కేసులు వేసి అక్కడి నుంచి నోటీసులు పంపిస్తున్నారు. నిరక్షరాస్యులమైన మాకు ఎక్కడికి పోవాలో, ఏమి చేయాలో తెలియడం లేదన్నారు.కావున తమరు స్పందించి ఈ విషయంలో మాకు న్యాయం చేయడంతో పాటు కలకత్తా కోర్టులో మైక్రో ఫైనాన్స్ కంపెనీలు మాపై వేసిన కోర్టు కేసుల విషయంలో లీగల్ ఎయిడ్ ను ఐటిడిఎ ద్వారా ఇప్పించి ఆదుకోగలరని నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాను శుక్లను కోరడమైనది.తగు చర్యలు తీసుకొంటామని హామీ ఇచ్చారు. అలాగే జిల్లాలోనీ గిరిజన మాచ్యకార సొసైటీ పరిధిలోనీ చెరువుల్లో చేప పిల్లలను వొదలని మరియు అల్లూరు మండలం గాలిదిబ్బలు యానాది కాలనీలో త్రాగు నీరు మరియు ఇతర సమస్యలు పరిష్కారించాలని కలెక్టర్ గారిని కోరడమైనది. ఈ కార్యక్రమంలో యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసి పెంచలయ్య,రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ తీరువీధి సతీష్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యల్లంపల్లి రమేష్, మహిళా విభాగం అధ్యక్షురాలు చెంబేటీ ఉష, జిల్లా నాయకురాలు చల్లంచర్ల తిరుపతమ్మ, నెల్లూరు జిల్లా నాయకులు యల్లంపల్లి శ్రీనివాసులు,తిరుమలశెట్టి సుబ్రహ్మణ్యం గిరిజన సొసైటీ నాయకులు బంగారయ్య, సుమన్ పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News