పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ సీతాఫల్‌మండి, పార్శీగుట్ట, కమలా నెహ్రూనగర్‌లో ఆదివారం రాత్రి గణేశ్ ఆగమన్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. గణేశ్ ఉత్సవ సమితి 29వ వార్షికోత్సవం సందర్భంగా సుమారు రూ.20 లక్షలతో భారీ లైటింగ్ ఏర్పాట్లు చేశారు. చిలకలగూడ నుంచి సీతాఫల్‌మండి ఎస్‌బీఐ లేన్‌వరకు పుణె బ్యాండ్ వాయిద్యాలు, కళాకారుల విన్యాసాలు, వేషధారణలు, భక్తుల కోలాహలం మధ్య గణనాథుడి శోభాయాత్ర సాగింది. దయశంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, ఎమ్మెల్యే పద్మారావుగౌడ్, తదితరులు పాల్గొన్నారు