Kaizer News

Andhra Pradesh Heavy Rain Alert | రేపటి నుంచి దంచి

Andhra Pradesh Heavy Rain Alert | రేపటి నుంచి దంచికొట్టనున్న వానలు!

· State - Telangana · prabhanews.com

విశాఖపట్నం, ఆంధ్రప్రభ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వేగంగా బలపడుతోంది. అమరావతి వాతావరణ కేంద్రం అంచనాల ప్రకారం.. ఇది రాబోయే 24 గంటల్లో (రేపటికి) వాయుగుండంగా, ఆ తర్వాత ఎల్లుండికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాలకు వాతావరణ శాఖ ఐఎమ్‌డీ (IMD) భారీ వర్ష హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 22, 23, 24 తేదీల్లో రాష్ట్రంలోని పలు కోస్తా జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండనుందని అధికారులు స్పష్టం చేశారు. మోస్తరు నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రభావిత జిల్లాలకు పసుపు, ఆరెంజ్ రంగు హెచ్చరికలను జారీ చేశారు. తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. సముద్రం అల్లకల్లోలంగా మారనున్నందున మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకూడదని అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే వేటకు వెళ్లిన వారు తక్షణమే సురక్షిత తీర ప్రాంతాలకు తిరిగి రావాలని ఆదేశించారు. అల్పపీడనం మరింత బలపడే కొద్దీ వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉందని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు మరియు దిగువ ప్రాంతాల నివాసితులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News