Kaizer News

Razole: రాజోలులో ఘనంగా కేఎస్ఎన్ రాజు పుట్టినరోజు వ

Razole: రాజోలులో ఘనంగా కేఎస్ఎన్ రాజు పుట్టినరోజు వేడుకలు

· State - Telangana · hmtvlive.com

Shorts రాజోలు: డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీఈసీ సభ్యులు కేఎస్ఎన్ రాజు పుట్టినరోజు వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. కేఎస్ఎన్ రాజు గారు ప్రస్తుతం స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో ఆయన అభిమానులు, అనుచరులు వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టి పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. రాజోలు గ్రామంలోని వివేకానంద మనోవికాస కేంద్రంలో మానసిక వికలాంగుల మధ్య కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. అనంతరం వారికి భోజనాలు ఏర్పాటు చేశారు. అలాగే సఖినేటిపల్లి మండలం శృంగారప్పాడు గ్రామంలోని మణికుమారి వృద్ధాశ్రమంలో వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. వృద్ధులకు భోజనాలు అందించి తమ అభిమాన నాయకుడి పుట్టినరోజును సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేఎస్ఎన్ రాజు అభిమానులు మాట్లాడుతూ, ఆయన పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. భవిష్యత్తులోనూ ప్రజా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో కంచర్ల శేఖర్, తెన్నేటి కిషోర్, అడబాల జానకి, నల్లి సుధీర్, కానూరి బాబీ, రాపాక శ్రీనివాస్, వెల్ల చక్రి తదితరులతో పాటు కేఎస్ఎన్ సైన్యం సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News