Kaizer News

Kadiyam: కడియం వీర పేరంటాలమ్మ ఆలయానికి చందన నాగేశ్

Kadiyam: కడియం వీర పేరంటాలమ్మ ఆలయానికి చందన నాగేశ్వర్ ఆర్థిక సాయం!

· State - Telangana · hmtvlive.com

Shorts Kadiyam: పురాతన ఆలయాల పరిరక్షణకు అభివృద్ధికి సమాజంలో ప్రతి ఒక్కరు తమ వంతు సహకారం అందించాలని రాష్ట్ర పచ్చదనం మరియు సుందరీకరణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ చందన నాగేశ్వర్ అన్నారు. కడియంలో యాదవుల గ్రామ దేవతగా కొలువైన శ్రీ వీర పేరంటాలమ్మ తల్లి పురాతన ఆలయాన్ని ఆదివారం వైసిపి రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు తో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు సోమరాజు, సత్యనారాయణ తదితరులు ఆలయం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాల్సిన అవసరాన్ని వారి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై సానుకూలంగా స్పందించిన చందన నాగేశ్వర్ ప్రహరీ గోడ నిర్మాణానికి కావలసిన 30 వేల రూపాయలు తాను అందిస్తానని, వెంటనే పనులను ప్రారంభించాలని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కుసునూరి బాబులు, గుత్తుల రమేష్, సర్కార్ భాష, పున్నమి రాజు వీర్రాజు, చిలుకూరి రామకృష్ణ, లావేటి రమేష్, బి ముత్యాలరావు, గుత్తుల సత్తిబాబు, తోరాటి గోపి, చెల్లుబోయిన దుర్గాప్రసాద్, సంతోష్, రవి, పిల్లి సుబ్రహ్మణ్యం, సోమరాజు, బత్తిన శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News