Kaizer News

రెడ్లలో చీలిక- బీజేపీ దోస్తీ-ఫైనల్ గా వైసీపీకి షాక

రెడ్లలో చీలిక- బీజేపీ దోస్తీ-ఫైనల్ గా వైసీపీకి షాక్..! సాయిరెడ్డి కొత్త పార్టీ అజెండా ఇదేనా?

· State - Telangana · telugu.oneindia.com

ఒకప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వ్యాపారాలకు ఆడిటర్ గా, తర్వాత వైఎస్సార్సీపీలో పార్లమెంటరీ పార్టీ నేతగా, ప్రాంతీయ సమన్వయకర్తగా ఓ వెలుగు వెలిగిన మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి .. ఆ తర్వాత హఠాత్తుగా ఎంపీ పదవికి, సొంత పార్టీకి రాజీనామా చేసి బయటికి వచ్చేసి వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు. ఆ తర్వాత తూచ్.. రాజకీయాల్లోనే ఉన్నానంటూ, కొత్త రాజకీయ పార్టీ పెట్టేందుకు సిద్దమవుతున్నారు. ఇంతకీ సాయిరెడ్డి పార్టీ ఏర్పాటు వెనుక అజెండా ఏంటి ?, టార్గెట్ ఏంటి? ఏపీ రాజకీయాల్లో ఇది ఎవరికి నష్టం చేయబోతోందన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సాయిరెడ్డి ప్లాన్ పై వన్ ఇండియా ఎక్స్ క్లూజివ్ కథనం.. సన్నిహితుడ్ని అడ్డుపెట్టి జగన్ టార్గెట్ ..! కూటమినీ లాగి-సాయిరెడ్డి బిగ్ ప్లాన్.! విజయ సాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ దసరాకు కొత్త రాజకీయ పార్టీ స్థాపించేందుకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సిద్ధమవుతున్నారు. ఈ మేరకు విజయవాడ, అనంతపురంలో రెండు ప్రెస్ మీట్లు పెట్టి తన అజెండాను క్రమంగా బయటపెడుతున్నారు. విజయవాడలో తన పార్టీ ఐదు అంశాల అజెండాను ప్రకటించారు. ఇందులో నిత్యావసర ధరలు తగ్గించడం - ప్రజల ఆదాయం పెంచడం, ఇళ్లకు, రైతులకు ఉచిత విద్యుత్ అందించడం, పెట్రోల్, డీజిల్‌పై పన్నుల తగ్గింపు, నీటి నిల్వ సామర్థ్యాన్ని 3 వేల టీఎంసీలకు పెంపు, విద్య, ఉద్యోగాలపై ప్రత్యేక దృష్టి ఉన్నాయి. విజయవాడ ప్రెస్ మీట్లో రెడ్లు, కమ్మ వారు మాత్రమే అధికారం అనుభవించాలా అంటూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సాయిరెడ్డి వేసిన ప్రశ్నపై వచ్చిన విమర్శలతో అనంతపురంలో అసలైన రెడ్ల కోసమే పనిచేస్తామంటూ మాట మార్చేశారు. అలాగే సీఎంగా తాను ఉండనంటూ ప్రాంతీయ పార్టీల్లో కనిపించని మరో విచిత్ర వాదన తెరపైకి తెస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి సాయిరెడ్డి కీలక డిమాండ్, రెడ్ల పౌరుషాన్ని కాపాడేందుకే..!! టార్గెట్ రెడ్లు, వైసీపీకి దూరం చేసే యత్నం ఏపీలో రెడ్డి సామాజిక వర్గం గతంలో కాంగ్రెస్ పార్టీకి, ఆ తర్వాత వైఎస్సార్సీపీకి దగ్గరగా ఉంది. టీడీపీలోనూ పేరుకు ఒకరిద్దరు రెడ్లు కనిపిస్తున్నా.. అంతిమంగా రెడ్లు వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్నారు. ఆ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వారిని వైఎస్సార్సీపీకి దూరం చేసేందుకు విజయసాయిరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్లు అర్దమవుతోంది. అందులో భాగంగానే కమ్మ, రెడ్లకే అధికారం ఇవ్వాలా అంటూ ప్రశ్నించారు. విమర్శలు వచ్చే సరికి రూటు మార్చి అనంతపురంలో కుల దోపిడీ పార్టీ, మత పిచ్చి పార్టీ అంటూ కొత్త స్వరం అందుకున్నారు. ఇప్పటికే వైసీపీలో ఉన్న రెడ్డి సామాజిక వర్గ నేతలతో టచ్ లోకి వెళ్తున్న సాయిరెడ్డి.. వారిని తన పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. అలాగే ఐఏఎస్, ఐపీఎస్ లలోని రెడ్లను కూడా లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. తద్వారా వైసీపీకి రెడ్లను సాధ్యమైనంతగా దూరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. విజయసాయిరెడ్డి తన కొత్త పార్టీ పెట్టకముందే లవ్ జిహాద్ వంటి ఉత్తరాదిలో బీజేపీ వాడుతున్న పదాన్ని తీసుకొచ్చి రాజమండ్రిలో ఎస్ఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య-సాదిక్ ఖాన్ ప్రమేయంపై విమర్శలు ఎక్కుపెట్టారు. అలాగే రాష్ట్రంలో వైసీపీ హయాంలో ఎన్నడూ లేనంతగా మత మార్పిళ్లు జరిగాయని, ఇప్పటికీ జరు

Original source: telugu.oneindia.com
Read more on Kaizer News