Kaizer News

15 ఏళ్లకే కెప్టెన్‌‌గా వైభవ్.. తొలి డీఆర్‌‌ఎస్‌‌తో

15 ఏళ్లకే కెప్టెన్‌‌గా వైభవ్.. తొలి డీఆర్‌‌ఎస్‌‌తోనే బుడ్డోడు సక్సెస్

· State - Telangana · v6velugu.com

బెంగళూరు, వెలుగు: భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ 15 ఏళ్లకే సీనియర్ జట్టుకు కెప్టెన్‌‌గా వ్యవహరించాడు. దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)లో ఈస్ట్ జోన్, సెంట్రల్ జోన్ తలపడుతున్నాయి. ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ కుడి మణికట్టుకు గాయం కావడంతో మైదానం వీడాడు. దీంతో వైస్ కెప్టెన్‌‌గా ఉన్న వైభవ్ స్టాండింగ్ కెప్టెన్‌‌గా జట్టు పగ్గాలు చేపట్టాడు. 39.1 ఓవర్‌‌లో జుయల్‌‌పై తీసుకున్న తొలి డీఆర్‌‌ఎస్‌‌ కూడా సక్సెస్ అయింది. రీప్లేలో బ్యాట్‌‌కు బంతి తగిలినట్లు తేలడంతో జుయల్ ఔటయ్యాడు. దులీప్ ట్రోఫీకి ముందే వైభవ్‌‌ను వైస్ కెప్టెన్‌‌గా ఎంపిక చేయడంపై అప్పట్లో ఆశ్చర్యం వ్యక్తమైంది. నార్త్ ఈస్ట్ జోన్‌‌తో క్వార్టర్ ఫైనల్లో బ్యాటింగ్‌‌లో 8 పరుగులే చేసినా.. బౌలింగ్‌‌లో రెండు వికెట్లు తీశాడు. ఐపీఎల్ 2026లో రాజస్తాన్ రాయల్స్ తరఫున మెరిసిన వైభవ్.. ఆ తర్వాత అంతర్జాతీయ టీ20ల్లోనూ అరంగేట్రం చేశాడు. జింబాబ్వే టూర్‌‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌‌గా నిలిచాడు. ఇషాన్ మళ్లీ బ్యాటింగ్‌‌కు వస్తాడా అనేది తేలాల్సి ఉంది

Original source: v6velugu.com
Read more on Kaizer News