ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరిగిపోవడంతో చిన్న సమాచారం కనిపించినా వెంటనే స్క్రీన్‌షాట్ తీసుకోవడం చాలామందికి అలవాటుగా మారింది. ముఖ్యమైన మెసేజ్, అడ్రస్, ఫోన్ నంబర్, ఫోటో లేదా ఇతర సమాచారం ఏదైనా సరే.. తర్వాత ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఫోన్‌లో సేవ్ చేసుకుంటుంటాం. అయితే ఈ అలవాటు మంచిది కాదని నిపుణులు అంటున్నారు. అమెరికా యూనివర్సిటీ పరిశోధనలో ఆసక్తికర విషయాలు అమెరికాలోని బింగ్‌హామ్‌టన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ అంశంపై అధ్యయనం నిర్వహించారు. ఫోటోలు తీయడం లేదా తరచూ స్క్రీన్‌షాట్లు తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందనే అభిప్రాయం సరైనది కాదని పరిశోధనలో తేలినట్లు తెలిపారు. పరిశోధకులు దీనిని 'ఫోటో-టేకింగ్ ఇంపెయిర్‌మెంట్ ఎఫెక్ట్'గా పేర్కొన్నారు. అంటే.. ఒక విషయాన్ని కేవలం శ్రద్ధగా గమనించిన వ్యక్తితో పోలిస్తే, దాని ఫోటో తీసుకున్న వ్యక్తికి ఆ విషయం గురించిన వివరాలు తక్కువగా గుర్తుండే అవకాశం ఉంటుందన్నమాట. మనకు అవసరమైన సమాచారం ఫోన్‌లో సురక్షితంగా ఉందనే నమ్మకం కలిగిన తర్వాత దానిని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదని మెదడు భావించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిశోధనలో భాగంగా కొందరు విద్యార్థులకు పెయింటింగ్స్, స్కెచ్‌లతో కూడిన పలు చిత్రాలను చూపించారు. వాటిలో కొన్ని చిత్రాలకు స్క్రీన్‌షాట్ తీసుకోవాలని సూచించగా, మరికొన్నింటిని కేవలం శ్రద్ధగా పరిశీలించాలని చెప్పారు. ఆ తర్వాత విద్యార్థులను ఆయా చిత్రాలకు సంబంధించిన చిన్న చిన్న వివరాలపై ప్రశ్నలు అడిగారు. ఈ పరీక్షలో ఆసక్తికరమైన ఫలితాలు వెలుగులోకి వచ్చాయి. స్క్రీన్‌షాట్ తీసుకున్న చిత్రాల వివరాలను విద్యార్థులు తక్కువగా గుర్తుపెట్టుకున్నట్లు తేలింది. అదే సమయంలో ఎలాంటి ఫోటో లేదా స్క్రీన్‌షాట్ తీసుకోకుండా కేవలం శ్రద్ధగా చూసిన చిత్రాల వివరాలను మాత్రం వారు మరింత స్పష్టంగా గుర్తుంచుకున్నారు. మరికొందరు విద్యార్థులు తాము ఏ చిత్రానికి స్క్రీన్‌షాట్ తీసుకున్నారో కూడా మర్చిపోయారని పరిశోధకులు గుర్తించారు. స్క్రీన్‌షాట్ తీసిన తర్వాత మెదడు ఎందుకు గుర్తుంచుకోదు? దీని వెనుక ప్రధానంగా రెండు కారణాలు ఉండవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. మొదటిది శ్రద్ధ మరలిపోవడం. మనం స్క్రీన్‌షాట్ తీసే సమయంలో స్క్రీన్, బటన్, ఫ్రేమ్ వంటి అంశాలపై దృష్టి పెడతాం. దీంతో ఆ సమయంలో కనిపిస్తున్న అసలు సమాచారాన్ని పూర్తిగా గమనించలేకపోతాం. రెండోది కాగ్నిటివ్ ఆఫ్‌లోడింగ్. అంటే ఒక సమాచారాన్ని ఫోన్‌లో సేవ్ చేసిన తర్వాత దానిని గుర్తుంచుకోవాల్సిన బాధ్యతను మెదడు తగ్గించుకోవడం. ఆ సమాచారం ఫోన్‌లో ఎప్పుడైనా చూసుకోవచ్చనే భావనతో మెదడు దాన్ని జ్ఞాపకంలో నిల్వ చేసేందుకు పెద్దగా ప్రయత్నించకపోవచ్చు. ఉదాహరణకు, గతంలో చాలా మంది ముఖ్యమైన ఫోన్ నంబర్లను గుర్తుంచుకునేవారు. ఇప్పుడు నంబర్లు అన్నీ మొబైల్‌లో సేవ్ అయిపోవడంతో సొంత కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లు కూడా చాలామందికి గుర్తుండటం లేదు. స్క్రీన్‌షాట్ల విషయంలోనూ ఇదే పరిస్థితి ఏర్పడవచ్చని నిపుణులు అంటున్నారు. ఏదైనా సమాచారం ఎక్కువ కాలం గుర్తుండాలని కోరుకుంటే వెంటనే స్క్రీన్‌షాట్ తీసుకోవడం కంటే దానిని స్వయంగా చదవడం, అర్థం చేసుకోవడం మంచిదని ప