దేశంలో కాలక్రమంలో విద్యాప్రమాణాలు పడిపోతున్నాయి. అంతర్జాలం, సామాజిక మాధ్యమాలు, మాస్ మీడియా ప్రభావంతో నాణ్యత పలుచనవుతూనే ఉన్నది. స్వాతంత్య్రం పొందిననాడు 18.33 శాతం ఉన్న అక్షరాస్యత, 79 సంవత్సరాలు గడిచినా నేటికి 80.90 శాతం మాత్రమే ఉన్నది. ఏటా కనీసం ఒక్క శాతం అక్షరాస్యత లక్ష్యంగా పెట్టుకొని పెంచినా ఈ పాటికి దేశం యావత్తు నూరు శాతం అక్షరాస్యత సాధించేది. ఇక సర్కారీ విద్య విషయానికి వస్తే సరేసరి. నాలుగేండ్లుగా దేశంలో సగటున రోజుకు 25 ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయి. ఇందులో తెలంగాణ అగ్రభాగాన ఉండడం ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం. తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ బడుల్లో ప్రమాణాలు పడిపోతున్నాయి. సర్కార్ తన బాధ్యతను విస్మరించి.. స్వచ్ఛంద సంస్థలకు పెద్దపీట వేయడం వల్ల విద్యారంగ ఉనికికే ప్రమాదం వాటిల్లుతున్నదని నిపుణులు చెప్తున్నారు. ఇంజినీరింగ్ పిల్లలకు సెలవు పత్రం, దరఖాస్తు నింపడం రావడం లేదంటున్న ముఖ్యనేత తన బాధ్యతల నుంచి తప్పుకొని చేతులు దులుపుకొంటున్నారు. ప్రభుత్వం కనీసం ప్రత్యేకంగా విద్యాశాఖకు మంత్రిని కూడా నియమించలేదు. ఈ శాఖ ముఖ్యమంత్రి ఆధీనంలోనే ఉన్నా.. విద్యాశాఖలో వైఫల్యాలు, పటిష్టత కోసం తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష చేసిందీ లేదు. మంత్రి లేకపోవడంతో ప్రభుత్వానికి, అధికారులకు సమన్వయం కొరవడిందని విద్యాశాఖలో చర్చ జరుగుతున్నది. రోజుకో కాగితం పుట్టగొడుగులా వెల్లువెత్తుతుండగా, ఉపాధ్యాయులు అయోమయంలో బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్పటివరకు యూనిఫారాలు, షూస్, ఎడ్యుకేషన్ కిట్లు పూర్తిగా అందలేదు. పదహారు లక్షల మంది మందికి బ్రేక్‌ఫాస్ట్ పెట్టలేని పెద్దమనిషి ప్రచార ఆర్భాటానికి పరిమితమయ్యారు. కేవలం సిబ్బంది హాజరు నమోదు కోసం ఏటా రూ.63 కోట్లు ప్రైవేట్ కంపెనీలకు చెల్లిస్తున్నారంటే పెద్దల ప్రాధాన్యతలేమిటో అర్థమవుతూనే ఉన్నది. మరోవైపు విద్యాశాఖలో అవినీతి పట్ల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ శాఖతో అనుసంధానమై ఉన్న సెంట్రల్ స్కేర్ అనే స్వచ్ఛంద సంస్థ విద్యాశాఖనే శాసిస్తున్నది. అయితే విద్యాశాఖలో పనిచేసిన కొంత మంది డైరెక్టర్లు, సెక్రటరీ స్థాయి అధికారులు ఏటా నాలుగైదు సార్లు విదేశీ పర్యటనలు ఎలా చేయగలుగుతున్నారు? వారికి స్పాన్సర్ చేస్తున్నది ఎవరు? సమాచార హక్కు చట్టం కింద అడిగినా, ఎందుకు వివరాలు బయటకు రావడం లేదు? శిశు సంరక్షణ సెలవు పెట్టి బాహాటంగా ఉన్నతాధికారి విదేశాలు తిరిగినట్టుగా వార్తలు ఎందుకు బయటకు వచ్చాయి? సదరు స్వచ్ఛంద సంస్థకు ఉన్న విశ్వసనీయత ఎంత? ఆ సంస్థలో ఎలాంటి ఉపాధ్యాయ శిక్షణ లేక కేవలం డిగ్రీ చదివిన పిల్లలు ఏకంగా జిల్లా విద్యాధికారులను, రాష్ట్రస్థాయి అధికారులను కూర్చోబెట్టి ఇలా చేయాలి, అలా చేయాలి అని ఎలా చెప్తారు? మీ జిల్లా పరిస్థితి ఇది, ఆ విద్యార్థి గతి ఇది, ఈ టీచర్ పనిచేయడం లేదని ఎలా ముద్రలు వేయగలుగుతున్నారు? అని ఉపాధ్యాయుల్లో ఆవేదన వ్యక్తమవుతున్నది. కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ర్టాల్లో స్వచ్ఛంద సంస్థల జోక్యాన్ని, ప్రమేయాన్ని తొలగించగా, తెలంగాణలోనూ బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో రద్దయిన ఈ సంస్థలు మళ్లీ ఎలా మొలకెత్తాయి అనేదే ప్రశ్న. అటు సీఎం వర్గానికి చెందినదిగా చెప్తున్న ఓ సంస్థకు ఏకం