Kaizer News

తాళాలు పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాల చోరీ

తాళాలు పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాల చోరీ

· State - Telangana · prabhanews.com

రెండు ఇళ్లలో చోరీ.. రూ.50 వేల విలువైన ఆభరణాలు అపహరణ ఎడపల్లి, ఆంధ్రప్రభ : ఎడపల్లి మండల కేంద్రంలోని నయాబాదు గ్రామం సాయికృపానగర్‌లో గుర్తుతెలియని దొంగలు రెండు ఇళ్ల తాళాలు పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాలను అపహరించారు. ఎస్సై ముత్యాల రమా తెలిపిన వివరాల ప్రకారం.. సాయికృపానగర్‌కు చెందిన నాజియా బేగం ఈ నెల 11న సాయంత్రం 5 గంటల సమయంలో తన తల్లి గ్రామమైన నీలా పేపర్‌మిల్‌కు వెళ్లారు. ఈ నెల 17న రాత్రి 10 గంటల సమయంలో అదే ఇంట్లో అద్దెకు ఉంటున్న సయ్యద్ మాజిద్ ఇంటికి వచ్చి చూడగా రెండు ఇళ్ల తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గమనించి నాజియా బేగంకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఇంటికి చేరుకున్న నాజియా బేగం పరిశీలించగా బీరువా తాళాలు కూడా పగులగొట్టి, వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువాలోని సుమారు 7 గ్రాముల బంగారు గొలుసు, 5 గ్రాముల బంగారు ఉంగరాలు అపహరణకు గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే మాజిద్ ఇంట్లోని బీరువా నుంచి సుమారు 7 గ్రాముల బంగారు ఉంగరాలు, 5 గ్రాముల బంగారు చెవి కమ్మలు, 24 తులాల వెండి పట్ట గొలుసులు చోరీకి గురైనట్లు తెలిపారు. చోరీకి గురైన ఆభరణాల విలువ సుమారు రూ.50 వేల వరకు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై ముత్యాల రమా తెలిపారు

Original source: prabhanews.com
Read more on Kaizer News