ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఎంఐఎం ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్ సస్పెన్షన్ వ్యవహారంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు. రహ్మత్ బేగ్‌ను అర్ధరాత్రి హడావుడిగా ఎందుకు సస్పెండ్ చేశారో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రజలకు స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. రహ్మత్ బేగ్‌పై భూకబ్జా, మైనర్ బాలికపై అత్యాచారం వంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయని తమ పార్టీకి చెందిన వారే చెబుతున్నారని రాజాసింగ్ ఆరోపించారు. ఈ వ్యవహారంలో అసలు నిజాలు ఏమిటో బయటపెట్టాలని కోరారు. రహ్మత్ బేగ్‌కు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు కొందరి వద్ద ఉన్నాయని, అవి బయటకు వస్తే పార్టీ ప్రతిష్ఠ దెబ్బతింటుందనే ఉద్దేశంతోనే రాత్రికి రాత్రే సస్పెండ్ చేశారంటూ రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయంపై అసదుద్దీన్ ఒవైసీ స్వయంగా మీడియా ముందుకు వచ్చి ఎందుకు వివరణ ఇవ్వడం లేదని రాజాసింగ్ ప్రశ్నించారు. రహ్మత్ బేగ్ సస్పెన్షన్ వెనుక ఉన్న అసలు కారణాలను ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు