Kaizer News

Mega DSC Sports Quota: ఆటలో గాయాల కంటే వైసీపీ దుష్

Mega DSC Sports Quota: ఆటలో గాయాల కంటే వైసీపీ దుష్ప్రచారమే ఎక్కువ బాధిస్తోంది: స్పోర్ట్స్ కోటా డీఎస్సీ టీచర్లు

· State - Telangana · telugu.abplive.com

విజయవాడలో క్రీడా కోటా టీచర్లు ఆరోపణలు ఖండించారు. ప్రతిభతో ఉద్యోగాలు సాధించామని, సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. పాత సన్మానాలు, సర్టిఫికెట్లు చూపి నియామకాలు సమర్థించుకున్నారు. రాజ్యాంగబద్ధమైన క్రీడా కోటా నియామకాలను టీచర్లు సమర్థించారు. విజయవాడ: తమపై జరుగుతున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని, రాజకీయ లబ్ధి కోసం తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయవద్దని మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా టీచర్లు కోరారు. ఏపీలో మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులు విజయవాడలో విస్తృత రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 370 మంది స్పోర్ట్స్ కోటా టీచర్లు హాజరయ్యారు. తమ నియామక ప్రక్రియపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) చేస్తున్న ఆరోపణలు, దుష్ప్రచారాన్ని వారు తీవ్రంగా ఖండించారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు స్పోర్ట్స్ కోటాను 3 శాతానికి పెంచిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కు ఈ సందర్భంగా టీచర్లు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమ సొంత ప్రతిభ, అర్హతలతో ఉద్యోగాలు సాధించిన తమను అవమానించడం ఎంతమాత్రం తగదన్నారు. మెగా డీఎస్సీ ప్రక్రియపై, తమ నియామకాలపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదని మరోసారి హెచ్చరించారు. వైసీపీ అసత్య ప్రచారాలను ప్రజలు, నిరుద్యోగులు నమ్మవద్దని వారు కోరారు. ఆ గాయాల కంటే ఈ మాటలే ఎక్కువ బాధిస్తున్నాయి తమపై, తమ నియామకాలపై కొన్ని రాజకీయ పార్టీల నేతలు, టీవీ ఛానళ్లు చేస్తున్న అసత్య ప్రచారాలపై వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎంతో కష్టపడి, క్రీడల్లో పతకాలు సాధించి అర్హత పొందితే తమను Fake అని వైసీపీ నేతలు అనడం దారుణమని మండిపడ్డారు. ఆటలు ఆడే సమయంలో అయిన గాయాల కంటే, ఈ అసత్యాలు తమను తీవ్రంగా గాయపరిచాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయం కోసం తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయవద్దని విజ్ఞప్తి చేశారు. ఆరోపణలు చేసేవారు ఇకనైనా తమ వద్ద ఉన్న ఒరిజినల్ సర్టిఫికేట్లను, మెడల్స్ చూసేందుకు కళ్లు తెరవాలని హితవు పలికారు. టాలెంట్ ఉంటే ఒకే కుటుంబంలో 2 ఉద్యోగాలు రాకూడదా.. తమ నియామకాల ప్రామాణికతను నిరూపించేందుకు టీచర్లు పలు కీలక ఆధారాలను సమావేశంలో ప్రదర్శించారు. గతంలో క్రీడల్లో మెడల్స్ సాధించినప్పుడు వైసీపీ ప్రభుత్వంలో క్రీడాశాఖ మంత్రిగా ఉన్న రోజా, SAAP మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి చేతుల మీదుగా తాము సన్మానాలు, సర్టిఫికేట్లు అందుకున్న ఫోటోలు, వీడియోలను సైతం ప్రదర్శించారు. సాఫ్ట్‌బాల్‌లో మెడల్స్ సాధించినప్పుడు తమను కొండపల్లి ఖిల్లాపై ప్రత్యేకంగా సన్మానించారని గుర్తుచేశారు. క్రీడా కోటాలో రాజ్యాంగబద్ధమైన హారిజంటల్ విధానంలోనే తమకు ఉద్యోగాలు దక్కాయని, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని తపాలా, ఐటీ, డీఆర్డీఓ, రైల్వే శాఖల్లోనూ ఇదేవిధంగా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విధానమే ఉందని స్పష్టం చేశారు. ప్రతిభ ఉంటే ఒకే కుటుంబంలో ఇద్దరికి ఉద్యోగాలు రాకూడదా అని నిలదీశారు. బ్రిడ్జ్ గేమ్, క్రీడాంశాలపై సరైన అవగాహన లేనివారే దీనిని పేకాట, గ్యాంబ్లింగ్‌తో పోలుస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ సైనికుడు

Original source: telugu.abplive.com
Read more on Kaizer News