కరీంనగర్: సర్ నోటీసుల పరిష్కార ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ అధికారులను ఆదేశించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ ఆవరణలో గల కళాభారతి లో ఏర్పాటు చేసిన సర్ నోటీసుల విచారణ కౌంటర్లను సందర్శించి పరిశీలించారు. ఏర్పాటు చేసిన పోలింగ్ బూతుల వారిగా కౌంటర్లలో నోటీసుల పరిష్కార ప్రక్రియ తీరు, సర్ నోటీసులకు ద్రువపత్రాలు సమర్పిస్తున్న వివరాలు, నమోదు రిజిస్టర్ ను తనిఖీ చేసి బిఎల్ఓ, సూపర్ వైజర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నోటీసుల ద్రువపత్రాల ఆన్ లైన్ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. పలు సూచనలు చేస్తూ.... ఆదేశాలు జారీ చేశారు. ఈ సంధర్బంగా కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ.... నోటీసులు జారీ చేసిన ప్రకారం పి. ఎల్ ల వారిగా ఓటర్లు ద్రువపత్రాలు సమర్పించేలా బిఎల్ఓ, సూపర్ వైజర్లు చర్యలు తీస్కోవాలన్నారు. నోటీసుల పరిష్కారం కోసం నిర్ణయించిన తేదీల ప్రకారం హాజరు కాని వారికి సమాచారం అందించి... గడువులోగా ద్రువపత్రాలు సమర్పించేలా చర్యలు ఆదేశించారు. నోటీసులు సమర్పించిన ప్రకారం ఆన్ లైన్ ప్రక్రియను ఎప్పటికప్పుడు చేపట్టాలన్నారు. సర్ నోటీసులు పరిష్కార ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. నోటీసులు జారీ అయిన వారు నిర్ణయించిన తేదీల్లో హాజరుకాని వారి కోసం ప్రత్యేక కౌంటర్లు కూడ ఏర్పాటు చేశామని....సెప్టెంబర్ 22 గడువులోగా కళాభారతి ఆవరణలోని సంబంధిత కౌంటర్ల వద్ద ద్రువపత్రాలు సమర్పించి... నోటీసులను పరిష్కరించుకొని ఆన్ లైన్ చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కమీషనర్ ఆయాజ్, డిప్యూటీ కమీషనర్ వేణు మాధవ్, ఏఈఆర్వో రాజేష్, తదితరులు పాల్గొన్నారు