ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని పలు గిరిజన గ్రామాలు ప్రశాంతతకు చిరునామాగా మారాయి. చుట్టూ ఎత్తైన కొండలు, పచ్చటి చెట్లు, గలగల పారే సెలయేళ్లు, పక్షుల కిలకిలరావాలతో ఆ గ్రామాల్లో ఆహ్లాదకర వాతావరణం కనిపిస్తోంది. ఆధునిక జీవనశైలి, నగరాల కాలుష్యానికి దూరంగా.. స్వచ్ఛమైన ప్రకృతి ఒడిలో పెంకుటిళ్లు, గుడిసెలతో ఉన్న ఈ గ్రామాలు ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటూ, ఆహ్లాదాన్ని పంచుతున్నాయి