Kaizer News

Kouthala: రీ సర్వేతో రైతులకు ఎంతో మేలు: అదనపు కలెక

Kouthala: రీ సర్వేతో రైతులకు ఎంతో మేలు: అదనపు కలెక్టర్ డేవిడ్

· State - Telangana · hmtvlive.com

Shorts కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: కౌటాల మండలంలోని భూ సమస్యల పరిష్కారంలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీ సర్వేతో రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం.డేవిడ్ అన్నారు. కౌటాల మండలం బాలేపల్లి గ్రామ శివారులో చేపట్టిన రీ సర్వే ప్రక్రియను జిల్లా భూ కొలతల అధికారి వినయ్ కుమార్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ నక్షాలు లేని గ్రామాలలో రీ సర్వే నిర్వహించడం జరుగుతుందని, భవిష్యత్తులో రైతుల మధ్య గెట్ల తగాదాలు ఉండవని, రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని తెలిపారు. రికార్డులలో ఉన్నట్టుగా మోకా మీద భూమి విస్తీర్ణం ఉంటుందని, ఎలాంటి భూతగాదాలకు ఆస్కారం లేకుండా అధికారులు సర్వే ప్రక్రియను సమర్ధవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్ రెవెన్యూ సిబ్బంది రైతులు తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News