Kaizer News

Guntur: సర్వేలను వారంలోగా పూర్తి చేయాలి: జీఎంసీ కమ

Guntur: సర్వేలను వారంలోగా పూర్తి చేయాలి: జీఎంసీ కమిషనర్

· State - Telangana · hmtvlive.com

Shorts గుంటూరు: రాష్ట్ర ప్రభుత్వ నిర్దేశిత సర్వేలను వారంలోగా పూర్తి చేసి, గుంటూరు నగర పాలక సంస్థ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ సచివాలయాల ప్రత్యేకాధికారులను ఆదేశించారు. శనివారం నగర పాలక సంస్థలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో వార్డ్ సచివాలయాలకు ప్రత్యేకాదికారులుగా నియమించబడిన అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, సర్వేలను త్వరితగతిన పూర్తి చేయుటకు తీసుకోవాల్సిన చర్యల పై తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, సచివాలయాల్లో కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో ఉండుటలేదని ప్రిర్యాదులు అందుతున్నాయని, కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. కార్యదర్శులు విధి నిర్వహణలో బయటకు వెళితే తప్పకుండా వారు మూవ్మెంట్ రిజిస్టర్ లో వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. వార్డ్ ప్రత్యేక అధికారులు వార్డు సచివాలయాల పనితీరును పర్యవేక్షించడంతో పాటు ప్రభుత్వ సర్వేలు, ఎన్నికల పనులు, జనగణన కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలలో ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వ సర్వేలైన ఈకెవైసి, పురమిత్ర సర్వేలు మరియు ఇతర ప్రభుత్వ సర్వేలను వారం రోజుల్లో పూర్తి చేయాలని, అందుకు ప్రత్యేకాధికారులు సచివాలయ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి వారికి దిశా,నిర్దేశం చేయాలని ఆదేశించారు. సర్వేల నిర్వహణలో సమస్యలేమైనా ఉంటె అధికారులకు తెలియజేయాలన్నారు. కార్యదర్శులు ఎవరైనా విధుల యందు నిర్లక్ష్యం వహిస్తే వారి పై చర్యలకు సిఫారసు చేయాలని ఆదేశించారు. అలాగే నూతన పెన్షన్లకు వచ్చిన దరఖాస్తుల వివరాలు అడిగి తెలుసుకొని, సదరు దరఖాస్తులను ఎటవంటి ఆలస్యం లేకుండా వెంటనే పరిశీలించి అధికారులకు పంపాలని ఆదేశించారు. ముఖ్యంగా ప్రజల నుండి వచ్చే పిర్యాదుల పరిష్కారం పట్ల అలసత్వం వహించవద్దని, ప్రజా ఫిర్యాదులను గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు వాట్సప్ గవర్నేన్స్ గురించి వివరించి, ప్రభుత్వం అందిస్తున్న సేవల గురించి ప్రజలకు తెలియచేయాలన్నారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్ సిహెచ్.శ్రీనివాస్, మేనేజర్ బాలాజీ బాష, వార్డ్ ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News