Kaizer News

టీమిండియా క్రికెటర్‌ సంచ‌ల‌న నిర్ణ‌యం.. 18 ఏళ్ల త‌

టీమిండియా క్రికెటర్‌ సంచ‌ల‌న నిర్ణ‌యం.. 18 ఏళ్ల త‌ర్వాత‌ వేరే జట్టుకు?

· National - India · sakshi.com

రంజీ ట్రోఫీ 2026-27 సీజన్ ప్రారంభానికి ముందు భారత సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన సొంత జట్టు అయిన విదర్భతో 18 ఏళ్ల అనుబంధానికి వీడ్కోలు పలికాడు. రాబోయే దేశవాళీ సీజన్‌లో కొత్త జట్టు తరఫున బరిలోకి దిగేందుకు విదర్భ క్రికెట్ అసోసియేషన్ నుంచి 'నో అబ్జెక్షన్ సర్టిఫికేట్' తీసుకున్నాడు. ఈ విషయాన్ని ఉమేష్ స్వయంగా ధ్రువీకరించాడు. "ఈ సీజన్ నుంచి మరొక రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని నిర్ణయించుకున్నాను. దీనికి సంబంధించి విదర్భ క్రికెట్ అసోసియేషన్ నుంచి ఎన్ఓసీ కూడా లభించింది" అని ఉమేశ్‌ పేర్కొన్నాడు. అయితే తానూ ఏ జట్టు తరఫున ఆడబోతున్నాడనే విషయాన్ని ఉమేష్ ఇంకా వెల్లడించలేదు. 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' కథనం ప్రకారం.. ఉమేష్ ఇప్పటికే కొన్ని రాష్ట్రాల క్రికెట్ బోర్డులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. 18 ఏళ్ల ప్రయాణానికి ముగింపు 2008-09 సీజన్‌లో విదర్భ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ఉమేష్.. రెడ్ బాల్ క్రికెట్‌తో పాటు వైట్ బాల్ ఫార్మాట్‌లోనూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అయితే భవిష్యత్తులో జట్టులో తన పాత్ర ఏమిటనే దానిపై విదర్భ సెలెక్టర్లు స్పష్టత ఇవ్వకపోవడమే అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అత‌డు చివ‌ర‌గా విద‌ర్భ త‌ర‌పున‌ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025-26లో ఆడాడు. ఈ టోర్నీల్లో 4 మ్యాచ్‌లు ఆడి 4 వికెట్లు ప‌డ‌గొట్టాడు. రంజీ ట్రోఫీలో మాత్రం ఆఖరిసారిగా అక్టోబర్ 2024లో నాగ్‌పూర్‌లో ఆంధ్రతో జరిగిన మ్యాచ్‌లోనే ఆడాడు. ఆ త‌ర్వాత అత‌డు రెడ్‌బాల్ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. చదవండి : AUS vs ZIM: జింబాబ్వే ప్లేయర్‌ ప్రపంచ రికార్డు.. వన్డే క్రికెట్‌ చరిత్రలోనే హాఫ్ శారీలో మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ (ఫోటోలు) కట్టుబాపు చీరలో కనువిందు చేస్తున్న కీర్తి సురేష్..(ఫోటోలు) నామినేషన్ వేసి అవసరమైతే జైలుకు వెళ్తామయ్య.. రిపోర్టర్ కి పేర్ని నాని అదిరిపోయే రిప్లై టీడీపీ నేతపై జర్నలిస్ట్ హిమబిందు సంచలన ఆరోపణలు రాకాతో హాలీవుడ్ ను టార్గెట్ చేసిన అల్లు అర్జున్? గుంటూరులో మరో లాకప్ డెత్.. అడ్వకేట్ రజిని స్ట్రాంగ్ వార్నింగ్

Original source: sakshi.com
Read more on Kaizer News