Kaizer News

సిద్దిపేటలో భారీగా పోలీస్‌ పహారా!

సిద్దిపేటలో భారీగా పోలీస్‌ పహారా!

· State - Telangana · ntnews.com

కాంగ్రెస్‌ ఎంపీల పర్యటనకు బందోబస్తా? 3 వేలకుపైగా పోలీసులతో భద్రత.. చెక్‌పోస్టులు.. అడుగడుగునా తనిఖీలు ప్రజల్లో చర్చనీయాంశంగా సర్కార్‌ తీరు సిద్దిపేట, సెప్టెంబర్‌ 18( నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీల బృందం సిద్దిపేట జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటుచేశారు. పర్యటనలో భాగంగా రాజీవ్‌ రహదారి వెంట ఎక్కడచూసినా పోలీసులే కనిపించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలీసులను భారీగా మోహరించారు. పకజిల్లాల నుంచి సైతం పోలీస్‌ బలగాలను రప్పించి మరి ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఎంపీల పర్యటన పేరుతో ఐజీ, డీఐజీ, కమిషనర్‌, అడిషనల్‌ డీజీ (లా అండ్‌ ఆర్డర్‌), డీఎస్పీలు, సీఐలతో కలిపి సుమారు 3,000 మంది పోలీసులు, డ్రోన్‌ కెమెరాలు, బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలతో ఏదో యుద్ధానికి సిద్ధమై ఉన్నట్టుగా పరిస్థితులు దర్శనమిచ్చాయి. ఎంపీలు, ఎమ్మెల్సీల బృందం పర్యటించే ప్రాంతాలతోపాటు ప్రధాన రహదారులు, కీలక కూడళ్ల వద్ద భారీగా పోలీసులను మోహరించారు. సాధారణంగా ప్రజాప్రతినిధుల పర్యటనకు భద్రతా ఏర్పాట్లు చేయడం సహజమే అయినా ఈ స్థాయిలో భారీ సంఖ్యలో పోలీసులను మోహరించడంపై స్థానికంగా చర్చ మొదలైంది. చెక్‌పోస్టులు ఏర్పాటు చేయడం, ఇతర జిల్లాల నుంచి బలగాలను తరలించడం, ఉన్నతాధికారులను బందోబస్తులో భాగస్వామ్యం చేయడంపై పలువురు స్థానికులు ఆసక్తిగా చర్చించుకున్నారు. ఇంత పెద్ద ఎత్తున పోలీస్‌ బందోబస్తు కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని వినియోగించడంపై స్థానికుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల అవసరాలకు వినియోగించాల్సిన ప్రభుత్వ వనరులను ఒక రాజకీయ పర్యటనకు ఇంత భారీగా వినియోగించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అనవసరంగా ప్రభుత్వ వనరులు, ప్రజాధనాన్ని దుబారా చేస్తున్నదంటూ స్థానికులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. కాంగ్రెస్‌ బృందం పర్యటన కంటే.. దానికి కల్పించిన భారీ భద్రతే సిద్దిపేటలో ప్రధాన చర్చగా మారింది. ఈ పర్యటనతో ఒనగూరింది ఏం లేదు.. ప్రజాధనం వృథా తప్ప అని స్థానికులు చర్చించుకున్నారు. ప్రభుత్వాలు వాస్తవాలను దాచిపెట్టినప్పుడు ప్రతిపక్షాలు నిజనిర్ధారణకు వెళ్తాయి. కానీ అధికారంలో ఉండి ప్రభుత్వమే యాత్రలకు రావడం విడ్డూరంగా ఉన్నదని పెదవి విరుస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీల బృందం శుక్రవారం సిద్దిపేట జిల్లాలో పర్యటించింది. హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన ఈ బృందం తొలుత కొండపాక మండలం వెలికట్ట గ్రామ పరిధిలో 271 సర్వేనంబర్‌లోని భూములను పరిశీలించింది. అనంతరం చిన్నకోడూరు మండలం రామంచ గ్రామ శివారులో ఉన్న రంగనాయక సాగర్‌ వద్ద మాజీ మంత్రి హరీశ్‌రావు వ్యవసాయ తోటను పరిశీలించారు. భూముల సర్వేనంబర్లు, విస్తీర్ణం, రిజిస్ట్రేషన్లు తదితర వివరాలపై అధికారుల ద్వారా ఆరాతీసింది. ఈ సందర్భంగా ఆ భూములకు సంబంధించిన రికార్డులు, అందుబాటులో ఉన్న వివరాలను కాంగ్రెస్‌ నేతల బృందానికి స్థానిక ఆర్డీవో వివరించారు. రికార్డుల్లో ఉన్న వివరాలను పరిశీలించిన నేతలు.. భూముల రిజిస్ట్రేషన్లపై అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా భూముల రిజిస్ట్ర

Original source: ntnews.com
Read more on Kaizer News