Kaizer News

ఆశ్రమ పాఠశాలలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం

ఆశ్రమ పాఠశాలలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం

· State - Telangana · prabhanews.com

తాడ్వాయి, ఆంధ్రప్రభ: ఊరట్టం ఆశ్రమ పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవంతో పాటు వ్యాయామ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కల్తీ శ్రీనివాస్ మాట్లాడుతూ మాతృభాషను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, తెలుగు భాషను మరచిపోకుండా చక్కగా నేర్చుకోవాలని సూచించారు. విద్యార్థులు చదువుతో పాటు జీవితంలో ఒక మంచి లక్ష్యాన్ని ఎంచుకుని దానిని సాధించేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు. విద్యతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. క్రమం తప్పకుండా ఆటలు ఆడటం వల్ల శారీరక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలుగు భాషాభివృద్ధికి గిడుగు రామమూర్తి పంతులు చేసిన సేవలను ఉపాధ్యాయులు, విద్యార్థులు స్మరించుకున్నారు. తెలుగు భాష ప్రాధాన్యం, మాతృభాష పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. వ్యాయామ ఉపాధ్యాయులు వివిధ క్రీడల ప్రాధాన్యం, విద్యార్థుల శారీరక దారుఢ్యానికి వాటి ఉపయోగాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది కార్యదర్శి, డిప్యూటీ వార్డెన్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News