Kaizer News

KTR | 12 గంటల కరెంట్‌ ఇస్తున్నరో రైతులను అడుగుదామా

KTR | 12 గంటల కరెంట్‌ ఇస్తున్నరో రైతులను అడుగుదామా..? సబ్‌స్టేషన్‌ తనిఖీలో కేటీఆర్.. వీడియో

· State - Telangana · ntnews.com

KTR | బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ శనివారం నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో కొల్లాపూర్‌ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డిని పరామర్శించి తిరుగు ప్రయాణంలో వనపర్తి జిల్లా పెబ్బేరుకు చేరుకున్నారు. రైతులు సాగు నీరు, కరెంట్‌ కోతలతో సతమతమవుతున్న నేపథ్యంలో పెబ్బే రు మండలం గుమ్మడం క్రాస్‌ రోడ్డు వద్ద రైతులతో మాట్లాడారు. గుమ్మడం గ్రామంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌ను సందర్శించిన కేటీఆర్ సబ్‌స్టేషన్‌లోని లాగ్‌బుక్స్‌ను పరిశీలించారు. విద్యుత్ కోతల గురించి స్థానిక రైతులను అడిగి తెలుసుకున్నారు. రోజుకు 5 గంటలే కరెంట్ వస్తుంది సార్.. మాకు కెనాల్ కూడా బంద్‌ అయింది.. సబ్‌ స్టేషన్‌ సిబ్బంది 12 గంటలు కరెంట్‌ ఇస్తున్నమంటే.. ఇస్తున్నవా.. బయటకు రైతులను అడుగుదామా..? ఒకసారి అని కేటీఆర్‌ ప్రశ్నించారు. కరెంట్‌ గురించి అడిగితే పైననే పోయింది.. మాకేం తెల్వదని అధికారులు చెబుతున్నారు.. మా చేన్లు అయితే ఎండిపోతున్నయ్‌.. ఒకటే మడి పారుతుంది సార్ అంటూ రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 90 శాతం పనులు చేసిపోతే 10 శాతం పడావు పెట్టి పాలమూరు రైతులను తొక్కుతున్నవ్‌.. పాలమూరు రైతుల వ్యవసాయాన్ని నాశనం చేస్తా ఉన్నవ్‌ రేవంత్‌ రెడ్డి.. వాళ్లు మిమ్మల్ని తరుమక ముందే మన కేసీఆర్ హయాంలో ఎలా కరెంట్ వచ్చేదో.. వెంటనే అలా సరిదిద్దాలని ప్రభుత్వానికి, అధికార యంత్రాంగాన్ని డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌ను సందర్శించిన కేటీఆర్ విద్యుత్ కోతల గురించి స్థానిక రైతులను అడిగి తెలుసుకుని, సబ్‌స్టేషన్‌లోని లాగ్‌బుక్స్‌ను పరిశీలించిన కేటీఆర్ pic.twitter.com/fmy76q8JhQ Plank Exercise | రోజుకు 60 సెక‌న్ల పాటు ప్లాంక్ చేస్తే బీపీ త‌గ్గుతుంది.. నిపుణుల వెల్ల‌డి.. RTC Elections | ఆర్టీసీలో ఎన్నికల నగారా.. 9న గుర్తింపు సంఘం ఎన్నికలు! iPhone 18 Pro | బంగారం అమ్మి భార్యకు ఐఫోన్‌ 18ప్రో.. భారత్‌లో మొదలైన 18 సిరీస్‌ అమ్మకాలు..!

Original source: ntnews.com
Read more on Kaizer News