Kaizer News

Amalapuram: ముమ్మిడివరం ఎయిమ్స్ కాలేజీలో ఈవీఎం భద్

Amalapuram: ముమ్మిడివరం ఎయిమ్స్ కాలేజీలో ఈవీఎం భద్రతపై కలెక్టర్ తనిఖీ!

· State - Telangana · hmtvlive.com

Amalapuram: గోదాములో ఉన్న స్ట్రాంగ్ రూమ్లపై పటిష్టమైన భద్రత ఏర్పాట్లపై నిఘా పెంచాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.శనివారం మమ్మిడివరం ఎయిమ్స్ కాలేజీ నందు మూడవ అంతస్తులో ఉన్న ఈవీఎంలు,వివి ప్యాట్ల భద్రత ఏర్పాట్లను పరిశీలించి తనిఖీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గోదాము లో ఈవీఎంలు, వీవీప్యాట్లను భద్రపరిచిన విధానం,భద్రతా చర్యలు,సీసీ కెమెరాల పనితీరు తదితర అంశాలను ఆయన పరిశీలించారు.గోదాముల పరిసరాల్లో భద్రతా ప్రమాణాలను నిరంతరం పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈవీఎంలు,వీవీప్యాట్లను ఎన్నికల నిబంధనల మేరకు అత్యంత భద్రతతో భద్రపరచాలని,గోదాములోకి అనధికార వ్యక్తుల ప్రవేశాన్ని పూర్తిగా నియంత్రించాలని సూచించారు.భద్రతా పర్యవేక్షణలో ఎలాంటి లోపాలు లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, విశ్వసనీయతను కాపాడే విధంగా ఈవీఎంలు,వీవీప్యాట్ల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.పోలీస్ బందోబస్తు పెంచి సీసీ కెమెరాలు నిఘా వ్యవస్థను ప్రతిష్టమైన ఏర్పాట్లు చేయాలని ఎలక్ట్రారోరల్ అధికారులను ఆదేశించారు. ఎలక్షన్ అధికారులు పోలీస్ వ్యవస్థ పరివేక్షణలో ఎలక్షన్ రిజిస్ట్రేషన్ బుక్ లో సంతకాలు చేశారు.కలెక్టర్ వెంట ముమ్మిడివరం తహసిల్దార్ టి సుభాష్,ఎలక్షన్ నిర్వహణ అధికారులు బాలాజీ బాబ్జి రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News