Kaizer News

యూపీఐ ఛార్జీల బాదుడులో మరో కోణం..! నిర్మలమ్మకు గుర

యూపీఐ ఛార్జీల బాదుడులో మరో కోణం..! నిర్మలమ్మకు గుర్తుచేసిన సాయిరెడ్డి..!

· State - Telangana · telugu.oneindia.com

ఒకప్పుడు అర్ధాంతరంగా నోట్ల రద్దు చేసి, జనం వ్యతిరేకతను తట్టుకునేందుకు డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు అంటూ యూపీఐ చెల్లింపుల విధానాన్ని అమల్లోకి తెచ్చిన కేంద్రం.. ఇన్నాళ్లూ దాన్ని ఉచితంగానే అందించింది. అయితే తాజాగా అమెరికా ఒత్తిడో, మరో కారణమో తెలియదు కానీ 2 వేలు దాటిన వ్యాపారులకు యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్ ఛార్జీలు విధిస్తూ వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. దీనిపై ఇప్పటికే వ్యాపారుల నుంచి సామాన్యుల వరకూ వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉంది. రెడ్లలో చీలిక- బీజేపీ దోస్తీ-ఫైనల్ గా వైసీపీకి షాక్..! సాయిరెడ్డి కొత్త పార్టీ అజెండా ఇదేనా? ఈ నేపథ్యంలో స్వతహాగా ఛార్జెట్ అకౌంటెంట్ అయిన వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy)..ఇవాళ యూపీఐ ఛార్జీలపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కు కీలక విజ్ఞప్తి చేశారు. ₹2,000 పైబడిన వ్యక్తి నుండి వ్యాపారికి జరిగే యూపీఐ లావాదేవీలపై ప్రతిపాదిత 0.4% ఎండీఆర్ ఒక సమస్య కావచ్చని ఆమెకు సాయిరెడ్డి తెలిపారు. తక్కువ లాభాలున్న వ్యాపారులు దీనిని వినియోగదారులపై మోపవచ్చు లేదా ₹2,000 లోపు చెల్లింపులను పలుమార్లు విభజించవచ్చని హెచ్చరించారు. తద్వారా ఇందులో ఉన్న రెండో కోణాన్ని కూడా బయటపెట్టారు. Recommended For You UPI MDR Row: యూపీఐ ఛార్జీల వెనుక అమెరికా హస్తం ? తేల్చేసిన కేంద్రం..! యూపీఐ ఉపయోగించినందుకు వ్యాపారులపై ఛార్జీలు విధించే బదులు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యూపీఐ లావాదేవీలను ఉచితంగా ఉంచడానికి, బడ్జెట్ మద్దతును కొనసాగించడాన్ని పరిగణించాలని సాయిరెడ్డి సూచించారు. యూపీఐ యొక్క గొప్ప బలాలలో ఒకటి దాని సున్నా-ఖర్చు, అవాంతరాలు లేని స్వీకరణ అని ఆయన గుర్తుచేశారు. మనం దానిని కాపాడుకోవాలని ఆర్దికమంత్రికి సలహా ఇచ్చారు. దీనిపై ఆర్ధికమంత్రి నిర్మలమ్మ ఎలా స్పందిస్తారో చూడాలి

Original source: telugu.oneindia.com
Read more on Kaizer News