Kaizer News

Sircilla: అక్టోబర్ 4న సిరిసిల్ల ఐఆర్‌సీఎస్ ఎన్నికల

Sircilla: అక్టోబర్ 4న సిరిసిల్ల ఐఆర్‌సీఎస్ ఎన్నికలు: కలెక్టర్ గరిమ అగ్రవాల్!

· National - India · hmtvlive.com

Shorts సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (ఐఆర్‌సీఎస్) మేనేజింగ్ కమిటీ ఎన్నికలు అక్టోబర్ 4న నిర్వహించనున్నట్లు జిల్లా ప్రెసిడెంట్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. జిల్లా సమాఖ్య భవనంలో ఉదయం 8 గంటల నుంచి ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మొత్తం 15 మంది సభ్యులను ఎన్నిక ద్వారా ఎన్నుకోనున్నట్లు పేర్కొన్నారు. ఐఆర్‌సీఎస్‌లో సభ్యత్వం ఉన్న వారు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులని స్పష్టం చేశారు. ఈ నెల 24న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 25న నామినేషన్ల పరిశీలన, 26న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ చేపట్టనున్నారు. అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు. అక్టోబర్ 4న ఎన్నికల అనంతరం అదే రోజు సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తామని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల అధికారిగా జిల్లా ఆడిట్ అధికారి శ్రీనివాస్ వ్యవహరిస్తారని వెల్లడించారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News