IPL 2027 Auction: ఐపీఎల్ (IPL) అభిమానులకు బీసీసీఐ తీపి కబురు అందించబోతుంది. గత మూడేళ్లుగా విదేశీ గడ్డపై జరుగుతున్న ఐపీఎల్ ప్లేయర్ల వేలాన్ని మళ్లీ భారత్‌కే తీసుకురావాలని బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 15న జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఈ విషయాన్ని చర్చించినట్లు సమాచారం. ఈ సారి డిసెంబర్ రెండో వారంలోనే ఆక్షన్ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. * 2023లో కొచ్చి వేదిక గా ఐపీఎల్ ఆక్షన్ జరిగింది. ఆ తర్వాత వరుసగా దుబాయ్, జెడ్డా, అబుదాబిలలో విదేశీ గడ్డపై వేలాన్ని నిర్వహించారు. అయితే విదేశాల్లో వేలం నిర్వహించడం వల్ల ఫ్రాంచైజీ యాజమాన్యాలకు, బీసీసీఐకి అదనపు ఖర్చులు పెరిగిపోతున్నాయని బోర్డు భావించింది. * మినీ ఆక్షన్ కాబట్టే: ఐపీఎల్ 2027 మినీ ఆక్షన్ (Mini-Auction) మాత్రమే కావడం, ప్రధాన ప్లేయర్లను జట్లు రీటైన్ చేసుకునే ఛాన్స్ ఉండటంతో ఈ సారి వేలాన్ని భారతదేశంలోని ఒక ప్రముఖ నగరంలోనే నిర్వహించాలని నిర్ణయించారు. వేలం వేదికను త్వరలోనే బీసీసీఐ అధికారికంగా ప్రకటించనుంది. * ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి రిషభ్: భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ తిరిగి తన పాత ఫ్రాంచైజీ అయిన ఢిల్లీ క్యాపిటల్స్ (DC) గూటికి చేరుకున్నాడు. ఇది ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత భారీ ట్రేడ్ డీల్‌గా నిలిచింది. * లక్నోకు కుల్దీప్ యాదవ్: మరోవైపు చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ట్రేడింగ్ ద్వారా దక్కించుకుంది. * కెప్టెన్‌నే ట్రేడ్ చేస్తున్నారా?: గత సీజన్‌లో ముంబైని నడిపించిన హార్దిక్ పాండ్యాను వేరొక జట్టుకు ట్రేడ్ చేసేందుకు ముంబై ఫ్రాంచైజీ సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. * రెండుమూడు ఫ్రాంచైజీల ఆసక్తి: హార్దిక్ పాండ్యాను సొంతం చేసుకునేందుకు రెండు ప్రముఖ ఐపీఎల్ ఫ్రాంచైజీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ, ఇప్పటి వరకు ఈ డీల్ అధికారికంగా ఫిక్స్ కాలేదు. * డిసెంబర్ రెండో వారంలో జరగబోయే ఈ మినీ ఆక్షన్‌లో ప్రధాన ప్లేయర్లను కాపాడుకుంటూనే, మిగిలిన స్పాట్ల కోసం ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడే అవకాశం కనిపిస్తుంది