Kaizer News

పాప్‌కార్న్‌ పేలేటప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? షాక

పాప్‌కార్న్‌ పేలేటప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? షాకింగ్‌ నిజాలు!

· State - Telangana · sakshi.com

పా ప్‌ కార్న్‌ ఎనీ టైమ్‌ స్నాక్‌.. సరదా కోసం ఎప్పుడు తినాలనిపించినా తింటుంటాం.. మరి పాప్‌ కార్న్‌కీ కొన్ని సరదా ముచ్చట్లున్నాయి. సరదాగా చదివేయండి. ఓల్డ్‌ మెయిడ్స్‌ – గింజలన్నీ పగిలి పాప్‌కార్న్‌ అయినా, గిన్నె అడుగున కొన్ని విత్తనాలు అలాగే ఉండిపోతాయి చూశారా? వాటికి అధికారికంగా ఒక పేరుంది... అదే ‘ఓల్డ్‌ మెయిడ్స్‌’! గింజ లోపల తగినంత తేమ లేకపోవడం వల్ల ఇవి పేలలేవు. పాప్‌కార్న్‌ బయట నుంచి ఎండిపోయినట్లు కనిపించినప్పటికీ, దాని లోపల దాదాపు 13% నుంచి 15% వరకు తేమ ఉంటుంది. గింజను వేడి చేసినప్పుడు, లోపల ఉన్న నీరు ఆవిరిగా మారడం ప్రారంభించి పాప్‌ కార్న్‌గా పనిచేస్తుంది. ఒక చిన్న పాప్‌కార్న్‌ గింజ పేలినప్పుడు గాలిలోకి ఏకంగా 3 అడుగుల (సుమారు 1 మీటరు) ఎత్తు వరకు ఎగురుతుంది. దాని పరిమాణంతో పోలిస్తే, ఇది ఒలింపిక్‌ హై జంపర్‌ కంటే ఎత్తుకు ఎగిరినట్లే! పాప్‌కార్న్‌ పేలినపుడు ఏర్పడే రూపాలను బట్టి రెండు రకాలుగా విభజిస్తారు. బటర్‌ ఫ్లై ఆకారం– ఇవి బటర్‌ఫ్లై రెక్కల ఆకారంలో ఉంటాయి. వీటిని ఎక్కువగా థియేటర్లలో ఉపయోగిస్తారు. మష్రూమ్‌ ఆకారం– గుండ్రంగా, పుట్టగొడుగులా ఉండే ఆకారం. కెరమెల్‌ పాప్‌కార్న్‌ తయారీలో విరిగిపోకుండా ఉండేందుకు వీటిని వాడతారు. 1920ల కాలంలో సినిమా థియేటర్ల యజమానులు పాప్‌కార్న్‌ను నిషేధించారు. కారణం... థియేటర్లు చాలా రిచ్‌గా కనిపించాలని, పైగా జనాలు నమిలే శబ్దం వల్ల సినిమాల్లోని సంభాషణలు వినపడవని భయపడ్డారు. కానీ ఆర్థిక మాంద్యం వచ్చాక, ఇది చాలా చవకైన వ్యాపారమని మళ్లీ ప్రవేశపెట్టారు. పూర్వం అమెరికాలోని ఆదివాసీలు మొక్కజొన్న కంకులను నేరుగా వేడి ఇసుకలో లేదా మంటల్లో వేసి, అవి పేలి బయటకు ఎగురుతున్నప్పుడు పట్టుకునేవారు. పాప్‌కార్న్‌ పేలినపుడు వచ్చే శబ్దం విత్తనం పొర పగలడం వల్ల రాదు. లోపల ఉన్న నీటి ఆవిరి ఒక్కసారిగా సూపర్‌సోనిక్‌ స్పీడ్‌తో బయటకు వచ్చి, పిండి పదార్థాన్ని విడదీసినప్పుడు వచ్చే చిన్న స్థాయి ‘ధ్వని విస్ఫోటనం’ అది! ఇవి కూడా చదవండి: ఆఫీస్‌ వర్క్‌లో ఫోకస్‌ పెరగాలంటే.. ఈ చిన్న బ్రేక్‌ తప్పనిసరి! మరోసారి పెళ్లి పీటలెక్కిన సీరియల్‌ నటి.. వైరల్‌గా (ఫొటోలు) ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు) హైదరాబాద్‌లో స్పోర్ట్ ఎక్స్‌పో ఇండియా 2026 ప్రారంభం (ఫొటోలు) 'ఇరుముడి' కావేరీ.. షూటింగ్‌లో ఎలా ఎంజాయ్ చేసిందో చూశారా? (ఫొటోలు) మా ఆయనను చంపింది కటౌట్ శ్రీను! సతీష్ రెడ్డి భార్య, వదిన సంచలన కామెంట్స్ టాక్సిక్ నిరాశలో రుక్మిణి.. ఇక ఆశలన్నీ డ్రాగన్ పైనే టార్చ్ లైట్లు వేసుకొని చికిత్సలా.. కొంచమైనా బుర్ర ఉందా..!?

Original source: sakshi.com
Read more on Kaizer News