Kaizer News

Nellore: పొదలకూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో షార

Nellore: పొదలకూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్!

· State - Telangana · hmtvlive.com

Shorts Nellore: నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని బాలాజీనగర్‌లో ఉన్న సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఆదివారం తెల్లవారుజామున షార్ట్‌ సర్క్యూట్‌ చోటుచేసుకుంది. ఈ ఘటనలో విద్యుత్‌ వైర్లు, ఇన్వర్టర్‌ కాలిపోయాయి. కార్యాలయ గది నుంచి దట్టమైన పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న సబ్‌ రిజిస్ట్రార్‌ శోభమ్మ కార్యాలయానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. జరిగిన ఘటనపై ఉన్నతాధికారులకు సమాచారం అందించారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News