ఘనంగా సంచార, అర్ధ సంచార, విముక్తి దినోత్సవం బ్రిటిష్ పాలనలో ఎదుర్కొన్న అవమానాలను గుర్తుచేసుకున్న వక్తలు సంచార జాతులు సనాతన ధర్మానికి నిజమైన వారసులు: పీవీఎన్ మాధవ్ సంక్షేమ పథకాలతో సంచార జాతుల అభివృద్ధికి కృషి: ప్రవీణ్ గుగే తిరుపతి సిటీ బ్యూరో, ఆంధ్రప్రభ: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధ్వర్యంలో తిరుపతిలో సంచార, అర్ధ సంచార, విముక్తి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంచార, అర్ధ సంచార జాతులకు చెందిన పలువురు పాల్గొన్నారు. నక్కల, సుగాలి తదితర సంచార జాతుల ప్రతినిధులు కార్యక్రమానికి హాజరై తమ సమస్యలను ప్రస్తావించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, డీనోటిఫైడ్ ట్రైబ్స్ నేషనల్ బోర్డు సభ్యుడు ప్రవీణ్ గుగే ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సంచార జాతుల సంక్షేమం, వారి సామాజిక, ఆర్థిక అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలపై నాయకులు మాట్లాడారు. డీనోటిఫైడ్ ట్రైబ్స్ నేషనల్ బోర్డు సభ్యుడు ప్రవీణ్ గుగే మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం సంచార, అర్ధ సంచార, విముక్తి జాతుల అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ఈ వర్గాల ప్రజలు విద్య, ఉపాధి, సామాజిక భద్రతతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందేలా కేంద్రం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. సంచార జాతుల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందన్నారు. సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ సంచార, అర్ధ సంచార, విముక్తి దినోత్సవాన్ని తిరుపతిలో పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. బ్రిటిష్ పాలనలో సంచార జాతులను ‘దొంగల జాతి’గా ముద్రవేసి అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, సనాతన ధర్మ పరిరక్షణలో సంచార జాతుల పాత్ర ఎంతో కీలకమని ఆయన అన్నారు. తరతరాలుగా తమ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ వస్తున్న వారు సనాతన ధర్మానికి నిజమైన వారసులని పేర్కొన్నారు. చాలా సంవత్సరాలుగా సంచార జాతుల్లోని అనేక కుటుంబాలకు ఆధార్ కార్డులు, కుల ధ్రువీకరణ పత్రాలు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని పీవీఎన్ మాధవ్ తెలిపారు. కుల ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన ప్రయోజనాలను పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యేవని చెప్పారు. బీజేపీ చేపట్టిన ‘జనతా వారధి’ కార్యక్రమం ద్వారా సంచార జాతుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. దీనిపై రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సంచార జాతులకు కుల ధ్రువీకరణ పత్రాలు అందించే ప్రక్రియను ప్రారంభించిందని పేర్కొన్నారు. ఇది సంచార జాతుల ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూర్చే చర్యగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ నాయుడు, రాష్ట్ర అధికార ప్రతినిధి జల్