సాక్షి, తాడేపల్లిగూడెం: రాష్ట్రంలో వెన్నుపోటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆక్వా రంగం పూర్తిగా కుదేలైందని వైఎస్సార్‌సీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్త, అప్సడా (APSADA) మాజీ వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వ్యవసాయ, అనుబంధ రంగాలు అద్భుతంగా ఉన్నాయంటూ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వాస్తవాలను తొక్కిపెట్టి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ అండదండలతో ఫీడ్ కంపెనీలు ఇష్టారాజ్యంగా ధరలు పెంచుతూ ఆక్వా రైతుల నడ్డి విరుస్తున్నాయని ఆరోపించారు. సీఎం చంద్రబాబు ఆక్వా డెవలప్‌మెంట్ అథారిటీకి చైర్మన్‌గా ఉండి కూడా ఫీడ్ మాఫియాను కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని, రైతుల ప్రయోజనాలను గాలికొదిలేసి కంపెనీలతో కుమ్మక్కయ్యారని విమర్శించారు. తాడేపల్లిగూడెంలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్బంగా రఘురాం.. ‘రాష్ట్రంలో ఆక్వా రంగం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని మంత్రి అచ్చెన్నాయుడు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తే ఫీడ్ రేట్లను కేజీకి రూ.14 నుంచి రూ.15 వరకు పెంచేశారు. ఫిబ్రవరి 26న కేజీకి రూ.4, మళ్లీ జూన్ 12న రూ.10 పెంచారు. టన్ను ఫీడ్‌పై ఏకంగా రూ.15,000 అదనపు భారం పడటంతో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. పంట సాగు చేసినా నష్టాలే మిగులుతుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో క్రాప్ హాలిడే ప్రకటించే ఆలోచనలో ఉన్నారు. ఫీడ్ కంపెనీల వద్ద విలువేది? గతంలో ఫీడ్ రేట్లు పెంచినప్పుడు రైతులు ఆందోళనలు చేయడంతో సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో సమావేశం ఏర్పాటు చేశారు. చంద్రబాబు స్వయంగా రూ.4 తగ్గించమని కోరితే.. కంపెనీలు కేవలం రూ.2 మాత్రమే తగ్గించాయి. అంటే సీఎం మాటకు కూడా ఆ కంపెనీల వద్ద విలువ లేకుండా పోయింది. ధరల నియంత్రణ కోసం కమిటీని వేశామని చెబుతున్న ప్రభుత్వం.. ఆ కమిటీని ధరలు తగ్గించడానికి వేశారా లేక పెంచడానికా? ఆక్వా అసోసియేషన్‌ను అడ్డం పెట్టుకుని ఫీడ్ కంపెనీలు ఆడిందే ఆటగా మార్చేశారు. గుజరాత్ కంపెనీ సర్క్యులర్.. ఆక్వా రైతుల గోడును పట్టించుకోకుండా ఫీడ్ కంపెనీలు మళ్లీ ధరలు పెంచేందుకు సిద్ధమయ్యాయి. సెప్టెంబర్ 1 నుంచి వనామీ ఫీడ్‌పై రూ.5.70, టైగర్ ఫీడ్‌పై రూ.3.85 పెంచుతున్నట్లు గుజరాత్‌కు చెందిన ఓ ప్రముఖ కంపెనీ ఇప్పటికే సర్క్యులర్ జారీ చేసింది. ప్రభుత్వం ఫీడ్ కంపెనీలతో లాలూచీ పడటం వల్లే వారు ఇలా యథేచ్ఛగా దోపిడీకి పాల్పడుతున్నారు. గతంలో కేజీకి రూ.2.85 పెరిగినప్పుడు నానా యాగి చేసిన చంద్రబాబు.. ఇప్పుడు ఏకంగా కూటమి ప్రభుత్వ హయాంలో రూ.14 పెంచితే ఎందుకు నోరు మెదపడం లేదు? గతంలో జే-ట్యాక్స్ అంటూ అవాకులు చవాకులు పేలినవారు.. ఇప్పుడు ఫీడ్ కంపెనీల నుంచి 'CLP ట్యాక్స్' (C-చంద్రబాబు, L-లోకేష్, P-పవన్ కళ్యాణ్) కింద ఎన్ని వేల కోట్ల ముడుపులు దండుకుంటున్నారో సమాధానం చెప్పాలి. ముడుపులు అందుతున్నాయి కాబట్టే రైతుల సమస్యలను ప్రభుత్వం గాలికొదిలేసింది. నాడు ఆక్వాకు స్వర్ణయుగం.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆక్వా రంగాన్ని కంటికి రెప్పలా కాపాడుకున్