Kaizer News

Amalapuram: అమలాపురంలో పేలుడు ప్రమాద బాధితులను పరా

Amalapuram: అమలాపురంలో పేలుడు ప్రమాద బాధితులను పరామర్శించిన శ్రీకాంత్!

· State - Telangana · hmtvlive.com

Shorts Amalapuram: అమలాపురం పట్టణంలోని మహిపాల వీధిలో ఎం.ఎస్.ఎన్. మూర్తి (మలిశెట్టి మూర్తి మాస్టర్) నివాసంలో ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలుసుకున్న అమలాపురం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ కోఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. ఈ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన డాక్టర్ పినిపే శ్రీకాంత్, ప్రమాద తీవ్రతను తెలుసుకోవడంతో పాటు ధ్వంసమైన ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు.బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమం లో శ్రీకాంత్ వెంట కర్రి వీరరాగవులు,తిక్కిరెడ్డి వెంకటేష్,కల్వకొలను ఉమా,మైనర్ బాబు,తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News