Hanamkonda: హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలంలో నిర్వహిస్తున్న “పల్లె పల్లెకు పొన్నం అన్న - పల్లె పల్లెలో ప్రజా పాలన” కార్యక్రమంలో భాగంగా గట్ల నర్సింగాపూర్ గ్రామంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల సమక్షంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామ ప్రజలు, రైతులు, మహిళా సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా, పలువురు వినతిపత్రాలు అందజేశారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి మంత్రి అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. గట్ల నర్సింగాపూర్ గ్రామంలో 2021 నుంచి ఏఎన్ఎం పోస్టు ఖాళీగా ఉందని గ్రామస్థులు మంత్రి దృష్టికి తీసుకురాగా, వారం రోజుల్లో ఏఎన్ఎంను నియమించాలని డీఎంహెచ్‌ఓను మంత్రి ఆదేశించారు. గ్రామంలో డ్రైనేజీ సమస్యను పరిష్కరించేందుకు మ్యాజిక్ ఫిట్ గుంతలు ఏర్పాటు చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్థల సేకరణ జరిగితే గ్రామానికి వీఓ భవనం మంజూరు చేస్తామని తెలిపారు. శిథిలావస్థలో ఉన్న వెటర్నరీ ఆసుపత్రికి మరమ్మతులు చేపడతామని హామీ ఇచ్చారు. గ్రామంలో శాశ్వత జీపీఓ నియామకం, స్మశానవాటిక రహదారి, కల్వర్టు నిర్మాణం, అంతర్గత సీసీ రోడ్లు, సోలార్ స్ట్రీట్ లైట్లు తదితర సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు. బస్ స్టేషన్‌కు నూతన భవనం.. ఎక్స్‌ప్రెస్ బస్ హాల్టింగ్ గట్ల నర్సింగాపూర్‌లో శిథిలావస్థలో ఉన్న బస్ స్టేషన్ స్థానంలో నూతన బస్ స్టేషన్ మంజూరు చేసి పనులు వెంటనే ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. గ్రామ ప్రజల విజ్ఞప్తి మేరకు గట్ల నర్సింగాపూర్ స్టేజి వద్ద ఎక్స్‌ప్రెస్ బస్సులకు ఆగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి సాగునీరు అందిస్తామని, ప్రాజెక్టు కాలువల కోసం భూసేకరణకు రైతులు సహకరించాలని మంత్రి కోరారు. భూములు ఇచ్చిన వారికి ప్రభుత్వం పరిహారం అందిస్తోందని తెలిపారు. ప్రజా పాలనలో గట్ల నర్సింగాపూర్‌కు భారీగా సంక్షేమం ప్రజా పాలన ప్రభుత్వంలో గట్ల నర్సింగాపూర్ గ్రామానికి అందుతున్న సంక్షేమ, అభివృద్ధి ఫలితాలను మంత్రి వివరించారు. 27 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, చాలా వరకు నిర్మాణాలు పూర్తయ్యాయి. త్వరలో రెండో దశలో మరిన్ని ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కానున్నాయి. 612 చేయూత పెన్షన్లకు రూ.1.58 కోట్లు విడుదల చేస్తున్నారు. గృహజ్యోతి పథకం కింద 735 కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ద్వారా రూ.1.76 కోట్ల లబ్ధి చేకూరింది. మహాలక్ష్మి గ్యాస్ సబ్సిడీ కింద 655 కుటుంబాలకు రూ.5.25 లక్షలు విడుదలయ్యాయి. 79 మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలుగా రూ.25.95 లక్షలు అందించారు. 12 మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ కింద రూ.3.90 కోట్లు రుణాలు అందించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు మూడు మహిళా సంఘాలకు 300 స్టీల్ బ్యాంక్ కిట్లు, ఒక్కో కిట్‌లో 13 రకాల వస్తువులు అందించారు. 973 మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు అందించారు. 170 మంది రైతులకు రూ.1.45 కోట్ల రైతు రుణమాఫీ జరిగింది. 828