Kaizer News

తెయూ సమాచారం

· State - Telangana · sakshi.com

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ రసాయన శాస్త్ర విభాగంలో పరిశోధక విద్యార్థిని బానోత్‌ ఉదయశ్రీ పీహెచ్‌డీ సాధించారు. రసాయన శాస్త్ర విభాగాధిపతి సాయిలు పర్యవేక్షణలో ‘క్వినజోలినోన్‌ సమ్మేళనాల రూపకల్పన, తయారీ, వాటి ఔషధ గుణాల మూల్యాంకనం’ అనే అంశంపై ఉదయశ్రీ పరిశోధన పూర్తి చేసి సిద్ధాంత గ్రంథం సమర్పించారు. శనివారం నిర్వహించిన ఓపెన్‌ వైవాకు ఓయూ రసాయన శాస్త్ర విభాగం ప్రొఫెసర్‌ పి.రాంచందర్‌ ఎక్స్‌టర్నల్‌ ఎగ్జామినర్‌గా హాజరయ్యారు. పరిశోధనకు సంబంధించిన పలు ప్రశ్నలను పరిశోధకురాలిని అడిగి సమాధానాలు రాబట్టారు. కార్యక్రమంలో సైన్స్‌ ఫ్యాకల్టీ డీన్‌ ప్రొఫెసర్‌ కె.సంపత్‌ కుమార్‌, బీవోఎస్‌ చైర్మన్‌ నాగరాజు, రసాయన శాస్త్ర విభాగాధిపతి బి.సాయిలు, అధ్యాపకులు ఎ.నాగరాజు, జి.బాలకిషన్‌, జి.నాగేశ్వరరావు, ఎం.రాజేశ్వరి, ఎస్‌.గంగాకిషన్‌, వి.డానియెల్‌, జి.నాగేంద్రబాబు, ఎం.సురేశ్‌, పరిశోధక విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో జూన్‌, జూలై 2026లో జరిగిన బీఈడీ, బీపెడ్‌ 2, 4వ సెమిస్టర్‌ రెగ్యులర్‌, 1, 2, 3, 4వ సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ థియరీ పరీక్షలకు సంబంధించి రీవాల్యుయేషన్‌ కోసం ఈ నెల 28 వరకు దరఖాస్తు చేసుకోవాలని కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ కే.సంపత్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రీవాల్యుయేషన్‌ దరఖాస్తు ఫారాలు సంబంధిత కళాశాల నుంచి పొందాలని సూచించారు. పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్‌ www. telanganauniversity. ac. in ను సంప్రదించాలని కంట్రోలర్‌ తెలిపారు. తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న ఎంఈడీ 1, 2, 3, 4వ సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ పరీక్షలు శనివారం ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్‌ ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఘంటా చంద్రశేఖర్‌ తెలిపారు. మొత్తం ఇద్దరు విద్యార్థులకు గాను ఇద్దరూ పరీక్షలకు హాజరైనట్లు పేర్కొన్నారు. బ్లాక్‌ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు) నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు) తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు) సైమా అవార్డ్స్ 2026 వేడుకలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (ఫొటోలు) ముంబై : వినాయక చవితి వేడుకల్లో బాలీవుడ్‌ జంట సందడి (ఫొటోలు) నన్నే భయపెట్టాలని చూస్తావా.. గుర్తుపెట్టుకో పెమ్మసాని లోన్ తీసుకునేవారికి RBI షాక్.. పెరగనున్న EMI భారం నీళ్లు లేని చెరువుల్లో గణేష్ నిమజ్జనాలు.. అసలేం జరిగిందంటే!

Original source: sakshi.com
Read more on Kaizer News