ఆదిలాబాద్: సమాజ శ్రేయన్సే ద్యేయంగా జీవిస్తూ, ప్రకృతితో మమేకమై మనుగడ సాగిస్తున్న ముదిరాజ్ సమాజం అన్ని రంగాల్లో మరింత ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ అన్నారు. ఆదివారం గాంధీ పార్కులో వెద్దమ్మ తల్లి, భీమన్న దేవుని ప్రతిష్టాపనను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు బస్టాండ్ ఎదుట పండుగ సాయన్న విగ్రహాన్ని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష సతీష్ తో కలిసి ఎమ్మెల్యే పాయల శంకర్ ఆవిష్కరించారు. తొలుత పూజలు చేసి సంఘం జెండాను ఆవిష్కరించారు. మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’