Kaizer News

Visakhapatnam: విశాఖలో 27న 22(ఏ) భూములపై సదస్సు: బ

Visakhapatnam: విశాఖలో 27న 22(ఏ) భూములపై సదస్సు: బి.వి.రామ్

· State - Telangana · hmtvlive.com

Shorts విశాఖపట్నం: విశాఖలో ఈ నెల 27న ఆదివారం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నంలో ఉదయం 10 గంటలకు 22(ఏ) భూములకు సంబంధించిన సమస్యలపై చర్చించి, రైతులు, భూయజమానులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు పరిష్కార మార్గాలను అన్వేషించేందుకు మాజీ ఐపీఎస్ అధికారి ఏ.బీ.వెంకటేశ్వరరావు, సెంటర్ ఫర్ లిబర్టీ అధ్యక్షుడు నల్లమోతు చక్రవర్తి నేతృత్వంలో సమగ్ర చర్చ నిర్వహించనున్నారు అని తెలుగు శక్తి అధినేత బి.వి.రామ్ ఓ ప్రకటనలో తెలిపారు. భూముల సమస్యలు, హక్కులు, సంబంధిత అంశాలపై చర్చించి, బాధితులకు న్యాయం జరిగేలా తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో దృష్టి సారించనున్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News