ఆంధ్రప్రదేశ్‌లో రాగల రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ వంటి పలు కోస్తా జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వాతావరణ మార్పులే అని అధికారులు తెలిపారు. మరికొద్ది గంటల్లో ఉత్తర అండమాన్ సముద్రంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం […]