Kaizer News

Bollapalli: బొల్లాపల్లిలో రూ. 2.20 కోట్ల భవనాలు ప్

Bollapalli: బొల్లాపల్లిలో రూ. 2.20 కోట్ల భవనాలు ప్రారంభించిన జీవీ ఆంజనేయులు!

· State - Telangana · hmtvlive.com

Bollapalli: బొల్లాపల్లి మండలంలో ఒకేరోజు రూ.2.20 కోట్లతో నాలుగు అభివృద్ధి భవనాలను ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ప్రారంభించారు. విద్య, వైద్యం, మౌలిక వసతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆయన తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను దశలవారీగా అందుబాటులోకి తీసుకొస్తున్నామని పేర్కొన్నారు .వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని జీవీ ఆంజనేయులు తెలిపారు . రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. తాగునీటి సమస్య ఉన్న గ్రామాలను గుర్తించి ట్యాంకర్ల ద్వారా నీరు అందిస్తామని హామీ ఇచ్చారు.అభివృద్ధిపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు స్పందించిన జీవీ ఆంజనేయులు, వైసీపీ ఐదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి లెక్కలు తీసుకురావాలని, కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేసిన అభివృద్ధి లెక్కలను తాము ప్రజల ముందుంచుతామని అన్నారు. ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో ప్రజలే నిర్ణయిస్తారని తెలిపారు. బీసీ రిజర్వేషన్లు 34 శాతం నుండి 24 శాతానికి తగ్గినప్పుడు జగన్ ఎందుకు న్యాయపోరాటం చేయలేదని ప్రశ్నించారు. DSCపై ఆరోపణలు చేయడం కాకుండా జగన్ అసెంబ్లీకి వచ్చి ఆధారాలతో చర్చించాలని, చర్చకు మంత్రి నారా లోకేశ్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో APPSCపై వచ్చిన ఆరోపణలకు ముందుగా జగన్ సమాధానం చెప్పాలని, యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న DSCపై అసత్య ప్రచారం మానుకోవాలని జీవీ ఆంజనేయులు సూచించారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News