సోషల్ మీడియాలో అధికార పార్టీకి వ్యతిరేకంగా పోస్టు పెట్టాడని కక్ష రోడ్డున పడ్డ ఒంటరి మహిళ కుటుంబం.. డబ్బా దుకాణం నేలమట్టం బూటు కాలితో తన్ని.. జీపులోకి ఈడ్చి పడేసి దాష్టీకం ఘటనను కవర్ చేసిన జర్నలిస్టుపైనా దురుసు ప్రవర్తన సీఐని విధుల నుంచి తొలగించాల్సిందే : మాజీ ఎమ్మెల్యే బొల్లం మంత్రి, ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకు దారుణం కోదాడ పట్టణంలో ఘటన కోదాడ, ఆగస్టు 28 : గత 30 సంవత్సరాలుగా జీవనాధారంగా ఉన్న డబ్బా కొట్టును మున్సిపల్ అధికారులు అనుమతి లేకుండా అక్రమంగా తొలగించగా.. శాంతియుతంగా నిరసన చేస్తున్న బాధితులపై, తన దాష్టీకాన్ని చూపించారు పట్టణ సీఐ. మహిళలు అని కూడా కనికరం లేకుండా విచక్షణారహితంగా చేతులతో నెట్టి, కాళ్లతో తన్ని ఖాకీ జులుం ప్రదర్శించిన వైనం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నది. కోదాడ పట్టణంలోని యాదవనగర్‌లో బీఆర్‌ఎస్ వార్డు ఇన్‌చార్జి మాధవ ఉపేందర్ అక్క గంధం కనకమ్మ గత 30 సంవత్సరాల క్రితమే డబ్బా కొట్టు ఏర్పాటు చేసుకొని తన ఇద్దరు ఆడపిల్లలతో జీవనం కొనసాగిస్తున్నది. భర్త లేని ఆమె రోజు వచ్చే డబ్బులతో బతుకు ఈడుస్తున్నది. మంత్రి, ఎమ్మెల్యే దంపతులకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమంలో మాదల ఉపేందర్ పోస్టులు పెట్టి, వారి ప్రతిష్ట దిగజారుస్తున్నాడని స్థానిక కాంగ్రెస్ నాయకులు గురువారం పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో హైదరాబాద్‌లో ఉన్న ఉపేందర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని హుటాహుటిన కోదాడకు తీసుకువచ్చి గురువారం రాత్రి 11 గంటల వరకు విచారణ చేపట్టారు. సదరు పోస్టుల్లోని అంశాలపై ఆధారాలు చూపాలని పోలీసులు నిలదీయడంతో సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులు మాత్రమే పార్వార్డ్ చేశానని ఉపేందర్ సమాధానం ఇచ్చాడు. అయినా పట్టించుకోకుండా ఉపేందర్‌పై పోలీసులు కేసునమోదుచేసి నోటీసులు ఇచ్చి న్యాయవాదుల సమక్షంలో వదిలిపెట్టారు. అంతటితో ఆగకుండా ఉపేందర్ అక్క గంధం కనకమ్మ డబ్బాకొట్టును తెల్లారేకల్లా తొలగించి, చెరువు పక్కన వేయించారు. ఈ తంతు అంతా కాంగ్రెస్ నేతల ఒత్తిడితోనే జరుగుతున్నదని ఉపేందర్ ఆరోపించారు. తమ జీవనాధారమైన డబ్బా కొట్టును తెలారే కల్లా తొలగించారని ఇందుకు మున్సిపల్ కమిషనరే బాధ్యులని, తక్షణమే డబ్బా కొట్టును తిరిగి ఏర్పాటు చేయాలని కోరుతూ కోదాడ ప్రధాన రహదారిపై శుక్రవారం బాధితురాలు గంధం కనకమ్మ, ఆమె కూతుళ్లు, తమ్ముడు ఉపేందర్‌తో పాటు బంధువులు శాంతియుతంగా నిరసన చేపట్టారు. దీంతో గంటసేపు ట్రాఫిక్ జామ్ కాగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు చేరుకొని సమస్య పరిష్కారానికి మున్సిపల్ కార్యాలయాలనికి వెళ్లాలని చెప్పినప్పటికీ బాధితులు కమిషనర్ తక్షణమే వచ్చి హామీ ఇస్తే నిరసన విరమిస్తామని భీష్మించారు. ఈక్రమంలో పట్టణ సీఐ శివశంకర్‌నాయక్ ధర్నా వద్దకు చేరుకుని ఉపేందర్‌ను మెడపట్టి కిందికినెట్టి ఈడ్చుకువెళ్లి పోలీసు వాహనంలో తోశాడు. అడ్డువచ్చిన మహిళలను చేతులతో నెట్టుతూ, కాళ్లతో తన్నాడు. కవరేజ్ కోసం వచ్చిన చింతలపాలెం జర్నలిస్టు సురేశ్‌ను సైతం సీఐ నెట్టివేశాడు. కాగా ఈ వ్యవహారం అంతా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోదాడ పట్టణంలో నిరసన తెలుపుతున్న బాధితుల వార్తను కవరేజ్ చేస్తున్న జర