Kaizer News

చెన్నూరులో భూ రీ సర్వే ప్రారంభం

చెన్నూరులో భూ రీ సర్వే ప్రారంభం

· State - Telangana · prabhanews.com

పారదర్శకంగా, కచ్చితత్వంతో పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్‌ రామయ్య చెన్నూర్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం రెవెన్యూ అధికారులు భూ వివరాల సమగ్ర పరిశీలనలో భాగంగా రీ సర్వే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) రామయ్య హాజరై అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రామాణిక విధానం ప్రకారం రీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా, కచ్చితత్వంతో నిర్వహించి నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలతో సమన్వయం పాటిస్తూ వారి నుంచి సమాచారం సేకరించి, భూ వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ సర్వే కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెద్దింటి పద్మ, శ్రీనివాస్‌, స్థానిక తహసీల్దార్‌ మల్లికార్జున్‌, ఆర్‌ఐ అజీజ్‌, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News