Kaizer News

ప్రశాంతంగా నీట్‌ పీజీ పరీక్ష

· State - Telangana · sakshi.com

మొయినాబాద్‌: నీట్‌ పీజీ ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. మున్సిపాలిటీలోని గ్లోబల్‌ ఇంజనీరింగ్‌ కళాశాల, వీజేఐటీ కళాశాల, చైతన్య డీమ్డ్‌ టూబీ యూనివర్సిటీల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. విద్యార్థులు అరగంట ముందుగానే ఆయా సెంటర్లకు చేరుకున్నారు. గ్లోబల్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలోని పరీక్ష కేంద్రంలో 120 మందికి గాను 119 మంది, చైతన్య డీమ్డ్‌ యూనివర్సిటీలో 120 మందికి 118, వీజేఐటీ కళాశాలలో 100 మందికి 96 మంది హాజరయ్యారు. ఏడుగురు విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. చేవెళ్ల డీసీపీ యోగేష్‌గౌతమ్‌, ఏసీపీ కిషన్‌, ఇన్‌స్పెక్టర్‌ మల్లికార్జున్‌రెడ్డి బందోబస్తును పర్యవేక్షించారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ సతీష్‌, ట్రాఫిక్‌ సిబ్బంది చర్యలు చేపట్టారు. ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు) ‘రోమాంచకం’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా విజయ్‌ దేవరకొండ (ఫొటోలు) నల్గొండ జిల్లాలో ఘనంగా శ్రావణ మాసం బోనాలు (ఫొటోలు) ABN రాధాకృష్ణని ఒక్కటే అడుగుతున్నా జోగి రమేష్ ఫైర్ నీకు టైం దగ్గర పడింది సాయిరెడ్డి... ఎవరిని చూసి రెచ్చిపోతున్నావో మాకు తెలుసు! సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. DMK స్టాలిన్ కు షాక్

Original source: sakshi.com
Read more on Kaizer News