Kaizer News

చిన్న గుడ్లు.. దండిగా దుడ్లు!

చిన్న గుడ్లు.. దండిగా దుడ్లు!

· State - Telangana · sakshi.com

అంగన్‌వాడీలో ఇచి్చన కోడిగుడ్డు బరువు 40 గ్రాములే ఉన్న దృశ్యం, 70 గ్రాములు బరువున్న బయట మార్కెట్‌లో దొరికే కోడిగుడ్డు అంగన్‌వాడీలకు కోడిగుడ్ల కాంట్రాక్టులో భారీ అవినీతి పిల్లల పొట్టగొట్టి సొమ్ము చేసుకుంటున్న పచ్చ ముఠాలు రాష్ట్రవ్యాప్తంగా సరఫరా కాంట్రాక్టర్లు అత్యధికులు టీడీపీ నేతలే బయట దొరికే గుడ్లతో పోలిస్తే సగం బరువు కూడా లేనివి అంటగడుతూ బిల్లులు వసూలు చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందించే పోషకాహారంలోనూ కాసుల వేట రవాణా చార్జీలు మిగుల్చుకునేందుకు నెలకు ఒకసారే పంపిణీతో మురిగిపోతున్న గుడ్లు రాష్ట్రంలో 23.10 లక్షల మందికి ఏటా 69.30 కోట్ల గుడ్ల సరఫరాలో గోల్‌మాల్‌ నాణ్యత తనిఖీలు గాలికి వదిలేసిన చంద్రబాబు సర్కార్‌ బయట మార్కెట్‌లో దొరికే కోడిగుడ్డు బరువు సగటున 70 నుంచి 80 గ్రాములు. అదే అంగన్‌వాడీ కేంద్రాలకు పంపిణీ చేసే కోడిగుడ్ల బరువు 35 నుంచి 40 గ్రాముల లోపే! అంటే బయట గుడ్డుతో పోలిస్తే సగం కూడా లేదు. రాష్ట్రంలో అంగన్‌వాడీలకు కోడిగుడ్ల సరఫరా కాంట్రాక్టు దక్కించుకున్న టీడీపీ నేతలు, అనుచరగణం నాసిరకం గుడ్లను అంటగ డుతూ రూ.వంద కోట్లకుపైగా అవినీతికి తెర తీశారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందించాల్సిన పోషకాహారానికి తూట్లు పొడుస్తున్నారు. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీల్లో గుడ్ల నమూనాలను సేకరించి బరువు, నాణ్యతా తనిఖీలు చేపట్టాలని లబి్ధదారులు డిమాండ్‌ చేస్తున్నారు. ⇒ పశ్చిమ గోదావరి జిల్లాలో 1,626 అంగన్‌వాడీ కేంద్రాలకు నెలకు 21,69,225 గుడ్లు సరఫరా అవుతున్నాయి. అవి కేవలం 3540 గ్రాములు మాత్రమే ఉంటున్నాయని లబ్ధిదారులు చెబుతున్నారు. ⇒ శ్రీసత్యసాయి జిల్లాలో 2,824 అంగన్‌వాడీ కేంద్రాలకు నెలకు 21.50 లక్షల గుడ్లు సరఫరా చేస్తున్నారు. అక్కడ కూడా ఒక్కొక్కటి 3540 గ్రాములు లోపే ఉంటున్నాయి. ⇒ నెలకు 25 గుడ్లు ఇవ్వాల్సి ఉండగా.. తక్కువగా ఇవ్వడం, మార్కెట్‌లో రేటు పెరిగితే అంగన్‌వాడీలకు అరకొరగా సరిపెట్టడం, అన్ని చోట్లా చిన్న గుడ్లు ఇవ్వడం, పాడైనవి ఇవ్వడం పరిపాటిగా మారిందని కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన ఒక గృహిణి వాపోయింది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏ అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లి చూసినా అక్కడ అందించే కోడి గుడ్లు చిన్నబోతున్నాయి! అంగన్‌వాడీల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందాల్సిన పోషకాహారంలో అత్యంత కీలకమైన కోడి గుడ్ల సరఫరాలో భారీ అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయి. గుడ్ల సరఫరా కాంట్రాక్టులు దక్కించుకున్న టీడీపీ నేతలు నిర్దేశిత బరువు కలిగిన గుడ్లకు బదులుగా అందులో సగం కూడా లేని అతి చిన్న కోడిగుడ్లు పంపిణీ చేసి పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. గుడ్లు చిన్నవే కానీ వాటి పేరుతో జరుగుతున్న దోపిడీ మాత్రం రూ.వంద కోట్లకుపైనే ఉండటం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీల్లో ఇదే దుస్థితి నెలకొంది. అంగన్‌వాడీల ద్వారా 3 నుంచి 6 ఏళ్లలోపు చిన్నారులకు ఒక్కొక్కరికి నెలకు 25 గుడ్లు చొప్పున పంపిణీ చేయాలి. బాలింతలు, గర్భిణులకు ఇంటికే సరుకులతోపాటు 25 గుడ్లను అందచేయాలి. ఏడు నెలల నుంచి మూడేళ్లలోపు చిన్నారులకు పాలతోపాటు గుడ్లను ఇంటికే ఇవ్వాలి. వీరందరికీ కలిపి రాష్ట్రంలో 23.10 లక్షల

Original source: sakshi.com
Read more on Kaizer News