తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ 7 నుండి 28 వరకు ఐటీడీఏ కేంద్రాలలో మార్చ్‌లు జరుగుతాయి. లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని ప్రధాన డిమాండ్. పోడు భూములకు పట్టాలు, ఉద్యోగాల్లో వాటా కూడా కోరారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఐటీడీఏ కేంద్రాలలో "ఆదివాసి మార్చ్" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు డా. మైపతి అరుణ్ కుమార్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద చలో ఐటిడిఏ ఆదివాసి మార్చ్ పోస్టర్లను ఆ సంఘం నాయకులతో కలిసి ఆవిష్కరించారు. వచ్చే నెల సెప్టెంబర్ 7న ఏటూరు నాగారం, సెప్టెంబర్ 16న ఉట్నూర్, సెప్టెంబర్ 21న భద్రాచలం, సెప్టెంబర్ 28న మన్ననూరులోని ఐటిడిఎ కేంద్రాలలో అధివాసి మార్చ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా డా.మైపతి అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆదివాసీల మనుగడ దిన దిన గండంగా మారిందని, ఎన్ని ర్యాలీలు బహిరంగ సభలు నిర్వహణ చేసి ఆదివాసీల సమస్యలను విన్నవించినా కానీ రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడ్డ చందంగా వ్యవహరిస్తుందన్నారు. అందుకే పోరాటాలు ఉధృతం చేయటం కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలకు పిలుపు ఇచ్చాం అన్నారు 1976 నుండి 2026 వరకు 50 ఏళ్లుగా ఆదివాసీల రిజర్వేషన్ లను దోచుకుంటున్న లంబాడి లను ఎస్టీ జాబితాల నుండి తొలగించటం కోసం ప్రత్యేక కమిషన్ ను నియమించాలని "5" వ షెడ్యూల్ ప్రాంత ఉద్యోగాలలో 29 శాఖల జీవోలను ట్రైబల్ అడ్వసరి కమిటీ (TAC) తీర్మానం ద్వారా ప్రత్యేక చట్టం చేయాలన్నారు. ఐటీడీఏ ద్వారనే ఉద్యోగ బర్తీ ప్రక్రియ ప్రమోషన్ లు బదిలీలు చేయాలనీ, కానిస్టేబుల్ ఉద్యోగాలలో 75 శాతం వాట ఏజెన్సీ DSC ఏర్పాటు, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి, గిరి వికాస్ బోర్లు దింపాలనీ, గోదావరి నది పై కట్టిన ప్రాజెక్ట్ లలో తుపాకుల గూడెం దేవాదుల కాళేశ్వరం నుండి ఆదివాసీ ప్రాంత రైతులకు సాగు నీరు ఇవ్వాలని, BTPS, KTPS, BPL, దేవపూర్ సిమెంట్ ప్యాక్టరీలో సింగరేణిలలో అధివాసి ల వాట, ఉద్యోగాల వాట, తదితర డిమాండ్ లతో ఈ మార్చ్ ల నిర్వహణ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ జాతీయ ప్రధాన కార్యదర్శి సిద్ధబోయిన లక్ష్మీనారాయణ, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పుర్క బాపురావ్ , జిల్లా అధ్యక్షులు పెందూరూ దాధిరావ్, రగల్ జెండా చైర్మన్ మెస్రం నాగ్ నాథ్, ప్రధాన కార్యదర్శి పుర్క చిత్రులు, జిల్లా ASU కార్యనిర్వాహక అధ్యక్షులు కనక గణేష్, మండల అధ్యక్షులు గెడం లాలు, నాయకులు కుర్సింగ రాందాస్, మెస్రం సందీప్ తదితరులు పాల్గొన్నారు. Frequently Asked Questions ఆదివాసి మార్చ్ కార్యక్రమం ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది? ఆదివాసి మార్చ్ సెప్టెంబర్ 7న ఏటూరు నాగారం, సెప్టెంబర్ 16న ఉట్నూర్, సెప్టెంబర్ 21న భద్రాచలం, సెప్టెంబర్ 28న మన్ననూరులోని ఐటీడీఏ కేంద్రాలలో జరుగుతుంది. ఆదివాసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ మార్చ్ జరుగుతోంది. తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు డా. మైపతి అరుణ్ కుమార్ ఈ ఉద్యమానికి పిలుపునిచ్చారు. లంబాడీలను ఎస్టీ జాబితాల నుండి తొలగించడం, ఐటీడీఏ ద్వారా ఉద్యోగ భర్తీ, పోడు