Shorts పశ్చిమగోదావరి జిల్లా: మొగల్తూరు మండలం పెద్దమైనవానిలంక బీచ్‌లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ 2026 కార్యక్రమంలో భాగంగా బీచ్ క్లీనింగ్, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. INCOIS ఆధ్వర్యంలో MSS సమన్వయంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో INCOIS అధికారి మండ మహేందర్, ఆర్డీవో, దాసిరాజు,ఎమ్మార్వో, నాగార్జున MSS ప్రతినిధులు, స్థానిక ప్రజలు, యువత, విద్యార్థులు పాల్గొన్నారు. బీచ్‌లో పేరుకుపోయిన ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు, ఫిషింగ్ నెట్స్, ప్లాస్టిక్ తాళ్లను తొలగించారు. సముద్రంలోకి ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను వేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అధికారులు అవగాహన కల్పించారు. సముద్ర పరిశుభ్రతను కాపాడటంలో ప్రజల భాగస్వామ్యం కీలకమని తెలిపారు. అలాగే INCOIS అందిస్తున్న సముద్ర పరిస్థితులు, అలల సమాచారం, సముద్ర హెచ్చరికలు, మత్స్యకారులకు ఉపయోగపడే సమాచార సేవలపై అవగాహన కల్పించారు. పెదమైనవానిలంకతో పాటు పేరుపాలెం, కేపీ పాలెం, చిన్న మైనవానిలంక ప్రాంతాల్లోనూ సముద్ర పరిశుభ్రత, భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు